దేశ వ్యాప్తంగా మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమం కొనసాగుతోంది. మార్చి, 2026 నాటికి మావోయిస్టులంతా లొంగిపోవాలని కేంద్రం ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు.
తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సీనియర్ మావోయిస్ట్, కేంద్ర కమిటీ సభ్యుడు రామ్‌ధేర్‌మజ్జీ సహా 11 మంది అనుచరులతో కలిసి రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అరుణ్ దేవ్ గౌతమ్ ముందు లొంగిపోయారు. మూడు AK-47, ఒక SLR, మూడు INSAS, రెండు 303 రైఫిల్స్‌తో మావోలు లొంగిపోయారు. ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి కలిసి పోయారు. ఈ 12 మందిపై రూ.2 కోట్ల 95 లక్షల రివార్డు ఉంది.
ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి మాట్లాడుతూ.. ఈ రెండేళ్ల పాలనలో తమ దళాలు మావోయిజంపై ధైర్యంగా పోరాడాయని తెలిపారు. దేశంలో మావోయిజం కనుమరుగైందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తున్నామని.. బహుళ బహుమతులు కూడా అందజేసినట్లు పేర్కొన్నారు.
