Site icon NTV Telugu

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో తీవ్ర విషాదం.. 12 మృతదేహాలు లభ్యం.. మిగతావారి కోసం గాలింపు!

Uttarkashi

Uttarkashi

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు పెను బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో ఊర్లకు ఊర్లనే తుడిచి పెట్టుకు పోతున్నాయి. వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగి పడి ప్రజలు ప్రాణాలను వదిలేస్తున్నారు. ఈరోజు ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలీలోని కొండపై నుంచి ఒక్కసారిగా వచ్చిన వరద బురదతో ఆ గ్రామం మొత్తం కొట్టుకుపోయింది. ఈ ఘటనతో అక్కడ సుమారు 50 మందికి పైగా గల్లంతు కావడంతో పాటు తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది.

Read Also: Rajagopal Reddy: ఎవరి కాళ్ళు మొక్కను.. మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఇక, ఈ భీకర వరద ప్రవాహం చూసి ప్రజలు ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఇక, ఇళ్లు పేక మేడల్లా కూలిపోతుంటే.. ప్రజలు వాటి కిందపడి నలిగిపోయారు.. కళ్ల ముందే ప్రాణాలు శిథిలమయ్యాయి. ఇప్పటి వరకు రెస్క్యూ టీమ్స్ కు కేవలం 12 మంది మృతదేహాలు మాత్రమే లభించాయి. మిగతా వారి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

Exit mobile version