దేశంలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సిన్ ను వేగంగా అందిస్తున్నారు. జులై నెలలో దేశంలో ఎన్ని డోసులు అందుబాటులో ఉంటాయనే దానిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ నెలలో 12 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని, ప్రైవేట్ వ్యాక్సిన్లు దానికి అదనం అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు. ఏ రాష్ట్రానికి ఎన్నెన్ని డోసులు అందిస్తున్నామో ఖచ్చితమైన లెక్కలు ఉన్నాయని అన్నారు. అయినప్పటికి కొంతమంది నేతలు కావాలని వ్యాక్సిన్ కొరత ఉందని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. గత నెలలో 11 కోట్లకు పైగా డోసులు రాష్ట్రాలకు ఉచితంగా అందించినట్టు మంత్రి పేర్కొన్నారు.
జులై నెలలో ఎన్నిడోసులు అందుబాటులో ఉండబోతున్నాయంటే…
