NTV Telugu Site icon

Heavy rainfall: హిమాచల్‌ప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు.. 115 రోడ్లు మూసివేత

Hima

Hima

హిమాచల్‌ప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. శుక్రవారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని సిమ్లా వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో దాదాపు 115 రహదారులను అధికారులు మూసివేశారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులున్నాయి.

ఇది కూడా చదవండి: AAP-Cong: కాంగ్రెస్, ఆప్ పొత్తుకు బ్రేక్..అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ

మండిలో 107, చంబాలో నాలుగు, సోలన్‌లో మూడు, కాంగ్రా జిల్లాలో ఒకటి సహా మొత్తం 115 రోడ్లు వర్షాల కారణంగా మూసివేశారు. వాహనాల రాకపోకలు జరగకుండా ముందస్తుగా నిలిపివేశారు. ఇక రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం ప్రకారం రాష్ట్రంలో 212 ట్రాన్స్‌ఫార్మర్‌లకు అంతరాయం ఏర్పడినట్లు పేర్కొంది.

ఇది కూడా చదవండి: Harish Rao: రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..

ఇదిలా ఉంటే చండీగఢ్-మనాలి నాలుగు-లేన్ల రహదారిలో మండి నుంచి పండోహ్ మధ్య పగుళ్లు ఏర్పడ్డాయి. బుధవారం నుంచి వన్-వే ట్రాఫిక్‌ను మాత్రమే అనుమతించాలని అధికారులు తెలిపారు. లక్షలాది రూపాయలు వెచ్చించి రిటైనింగ్ వాల్‌ను నిర్మించినప్పటికీ రెండు అడుగుల మేర పడిపోయిందని, నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని ప్రాజెక్ట్ మేనేజర్ రాజ్ శేఖర్ తెలిపారు.

ఇది కూడా చదవండి: Harish Rao: రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..

ఇక శని, ఆదివారాల్లో (జూలై 6 మరియు 7) భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. బలమైన గాలులు, వర్షం కారణంగా తోటలు, ఉద్యానవనాలు, పంటలకు నష్టం కలిగే అవకాశాలున్నాయని తెలిపింది. కచ్చా ఇళ్లు, గుడిసెలకు స్వల్ప నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది. రాష్ట్ర రాజధాని సిమ్లాలో బుధవారం సాయంత్రం నుంచి 84 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో పలు చెట్లు నేలకూలాయి. ఇక చెత్తాచెదారం రోడ్లపై పడి ఉంది.

ఇది కూడా చదవండి: SSMB 29 : ఏంటి సార్ ఇదీ.. వంట పాత్రలకు 20 లక్షల ఖర్చా?