Ram Navami: శ్రీరామ నవమి సమీపిస్తుండటంతో అయోధ్య రామమందిరం ముస్తాబైంది. అయోధ్య నగర వ్యాప్తంగా యూపీ సర్కార్ కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. ఇప్పటికే దేశ నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. శ్రీరామ నవమి రోజు లక్షలాది మంది భక్తులు అయోధ్యకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే రామ నవమి సందర్భంగా అయోధ్య రాముల వారికి ఏకంగా 1,11,111 కిలోల లడ్డూలను ప్రసాదంగా సమర్పించబోతున్నారు. దేవరహ హన్స్ బాబా ఈ భారీ లడ్డూను పంపనున్నట్లు దేవరహ హన్స్ బాబా ట్రస్టీ అతుల్ కుమార్ సక్సేనా తెలిపారు.
Read Also: Israel-Iran Conflict: ఇజ్రాయిల్‌కి అమెరికా షాక్.. ఇరాన్‌పై దాడిలో పాల్గొనమన్న బైడెన్..
లడ్డు ప్రసాదాలను ప్రతీ వారం కాశీ విశ్వనాథ ఆలయం, తిరుపతి బాలాజీ ఆలయాలకు పంపిస్తున్నట్లు అతను వెల్లడించారు. జనవరి 22న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠా రోజున దేవ్రహ హన్స్ బాబా ఆశ్రమం 40 వేల కిలోల లడ్డూను నైవేద్యానికి పంపినట్లు తెలిపారు. దాదాపుగా 500 ఏళ్ల తరువాత అయోధ్యలో శ్రీరాముడి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. రామ్ లల్లా విగ్రహానికి ప్రత్యేక వస్తాలతో పాటు వేల క్వింటాళ్ల పూలతో అలంకరించనున్నారు. అయోధ్య నగర వ్యాప్తంగా 100కి పైగా ఎల్‌ఈడీ స్క్రీన్లను సిద్ధం చేస్తున్నారు. రామ నవమికి వచ్చే లక్షలాది మంది భక్తులకు దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు 600 మీటర్ల మేర జర్మన్ హ్యాంగర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఎండలకి భక్తుల పాదాలు కాలిపోకుండా కార్పెట్ సిద్ధం చేస్తున్నారు.