NTV Telugu Site icon

Heatwave: ఉత్తరాదికి “వడదెబ్బ”.. 110 మంది మృతి, 40 వేల హీట్ స్ట్రోక్ కేసులు..

Heat Wave

Heat Wave

Heatwave: ఉత్తరాది రాష్ట్రాల్లో వడగాలులు, ఉష్ణోగ్రతలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జూన్ మాసం చివరికి వచ్చినా కూడా ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో వేడి తీవ్రత తగ్గలేదు. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు దేశంలో 110 వడదెబ్బ మరణాలు నమోదైనట్లు కేంద్రం ఆరోగ్యమంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. దీంతో పాటు వేసవిలో మొత్తం 40,272 వడదెబ్బ కేసులు నమోదయ్యాయి.

Read Also: Chinese Sailors Attack: గాల్వాన్ తరహాలో చైనా సైన్యం దురాగతం.. ఫిలిప్పీన్స్‌పై గొడ్డళ్లు, కత్తులతో దాడి..

అత్యధిక మరణాలు ఉత్తరప్రదేశ్ (36), ఆ తర్వాతి స్థానాల్లో బీహార్ (17), రాజస్థాన్ (16) ఉన్నాయి. ముఖ్యంగా, మే నెలాఖరు వరకు 56 మంది హీట్‌స్ట్రోక్ మరణాలు, 24,849 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మరోవైపు దేశరాజధాని ఢిల్లీ పెరిగిన ఉష్ణోగ్రతలు, వేడిగాలులతో నిప్పుల కొలిమిలా ఉంది.

Read Also: IND vs AFG: ఇండియా-అప్ఘనిస్తాన్ మ్యాచ్.. ఆ జట్టుకే విజయావకాశాలు

ఇదిలా ఉంటే, కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా బుధవారం దేశంలో వడగాలుల పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. హీట్‌వేవ్‌పై రాష్ట్రాలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ మార్గదర్శకాలు జారీ చేశారు. వడదెబ్బకు గురైన వారికి అందిచాల్సిన చికిత్స, ప్రత్యేక ఏర్పాట్ల గురించి సమీక్షించారు. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు రావొద్దని, ఎక్కువగా ద్రవాహారం తీసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

Heat sT