NTV Telugu Site icon

PAN Cards: 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివేట్.. కేంద్రం ఏమంటుందంటే..!

Untitled 7

Untitled 7

ప్రస్తుతం ప్రజలు ఆధార్, పాన్ కార్డులు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఎందుకంటే.. ప్రభుత్వానికి సంబంధించిన ఏ సేవను పొందాలనుకున్న ఆధార్ తప్పనిసరి.. అలానే బ్యాంక్ లావాదేవీలకు పాన్ కార్డు కచ్చితంగా ఉండాలి. దీని కారణంగా ప్రస్తుతం దేశంలో 70.24 కోట్ల మంది పాన్ కార్డును కలిగి ఉన్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం 11.5 కోట్ల పాన్ కార్డులను డీయాక్టివేట్ చేసింది. వివరాలలోకి వెళ్తే.. ప్రస్తుతం పాన్ కార్డు అప్లై చేసుకునే వాళ్ళకి 2017 తరువాత పాన్ కార్డు తీసుకున్న వాళ్లకు ఆధార్ లింక్ అయ్యి ఉంది. కానీ 2017 సంవత్సరానికి ముందు మంజూరైన పాన్ కార్డులకు ఆధార్ లింక్ చేసి లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గత కొంత కాలంగా పాన్ కు ఆధార్ లింక్ చేసుకోమని చెప్తూనే ఉంది. ఈ క్రమంలో పలుమార్లు గడువు పెంచుతూ వచ్చింది. పాన్ కార్డు కు ఆధార్ లింక్ చేసుకోమని పొడిగించిన గడువు కూడా ఈ ఏడాది జూన్ 30తో ముగిసింది.

Read also:Israel PM: గాజాను స్వాధీనం చేసుకునే ఉద్దేశం మాకు లేదు..

ఈ నేపథ్యంలో 12 కోట్లకు పైగా పాన్ కార్డులు ఆధార్ తో అనుసంధానం కానట్టు కేంద్రం గుర్తించింది. దీనితో ఆధార్ లింక్ కానీ 11.5 కోట్ల పాన్ కార్డులను డీయాక్టివేట్ చేసింది. అయితే పాన్ కార్డులను డీయాక్టివేట్ చేయడం పట్ల వివరణ ఇవ్వాల్సిందిగా.. మహారాష్ట్రకు చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కార్యకర్త కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (సీబీడీటీ) ను కోరారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు సీబీడీటీ సమాధానమిచ్చింది. నిర్ణీత గడువు లోపు ఆధార్ తో అనుసంధానం చెయ్యని పక్షంలో 11.5 కోట్ల పాన్ కార్డులను డీయాక్టివేట్ చేసినట్టు పేర్కొంది. కాగా దేశంలో 70.24 కోట్ల మంది పాన్ కార్డులు కలిగి ఉండగా అందులో 57.25 కోట్ల మంది మాత్రమే ఆధార్ తో పాన్ కార్డును అనుసంధానం చేసుకున్నారని వివరించింది. ఈ క్రమంలో ఎవరైతే గడువులోపు పాన్ కి ఆధార్ ను అనుసంధానం చేయించుకోలేదో వాళ్ళ పాన్ కార్డులు డీయాక్టివేట్ చేసినట్లు వెల్లడించింది.