Site icon NTV Telugu

All-Party Meet: 100 మంది ఉగ్రవాదులు హతం.. ఆల్ పార్టీ మీట్‌లో రాజ్‌నాథ్ సింగ్..

Rajanath Singh

Rajanath Singh

All-Party Meet: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ కోడ్‌నేమ్‌తో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. బుధవారం తెల్లవారుజామున భారత్ పెద్ద ఎత్తున క్షిపణులను ప్రయోగించి పీఓకే, పాక్ భూభాగాల్లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కార్యాలయాలతో పాటు ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లపై విరుకుపడింది.

Read Also: India Pakistan: సరిహద్దు దాటేందుకు పాక్ జాతీయుడి యత్నం.. కాల్చి చంపిన బీఎస్ఎఫ్.

అయితే, ఈ దాడిపై గురువారం కేంద్రం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించింది. దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ ఆపరేషన్ గురించి వెల్లడించింది. రాజ్‌నాథ్‌ సింగ్, అమిత్‌షా ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. అయితే, ఈ ఆపరేషన్లో దాదాపుగా 100 మందికి పైగా ఉగ్రవాదుల హతమైనట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.

ఈ సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ,అసదుద్దీన్ ఓవైపీ వంటి విపక్ష నేతలు హాజరయ్యారు. గంటన్నరపాటు అఖిలపక్ష భేటీ జరిగింది. ఆపరేషన్ సిందూర్‌, సరిహద్దు భద్రతా వివరాలను రాజ్‌నాథ్ సింగ్ నేతకు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తామని అన్ని పార్టీలు చెప్పాయి. కేంద్రానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పారు.

Exit mobile version