Site icon NTV Telugu

BJP MPs Resign: బీజేపీ సీఎంలపై ఉత్కంఠ.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 10 ఎంపీల రాజీనామా..

Bjp Mps Resign

Bjp Mps Resign

BJP MPs Resign: 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాషాయ జెండాను ఎగరేసింది. అయితే ఈ రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థులను నిర్ణయించే విషయంలో బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. గతంలో ఉన్న సీఎంలు మార్చి కొత్త ముఖాలను తీసుకురావాలని అనుకుంటున్నట్లు సమాచారం.

Read Also: Keedaa Cola : ఓటీటీలోకి వచ్చేచేస్తున్న తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 12 మంది లోక్‌సభ ఎంపీలు, వారి రాష్ట్రాల్లో పోటీ చేసి గెలుపొందారు. కాగా వీరి నుంచే పలు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారనే వార్తలు వినిపిస్తున్నా నేపథ్యంలో ఈ రోజు 10 మంది బీజేపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామాలను సమర్పించేందుకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నేతృత్వంలో ఎంపీల బృందం స్పీకర్ని కలిసింది.

స్పీకర్‌ను కలిసిన వారిలో మధ్యప్రదేశ్‌కు చెందిన నరేంద్ర తోమర్, ప్రహ్లాద్ పటేల్, రితీ పాఠక్, రాకేష్ సింగ్, ఉదయ్ ప్రతాప్ సింగ్ ఉన్నారు. రాజస్థాన్ నుండి, రాజీనామా సమర్పించిన ఎంపీలలో రాజ్యవర్ధన్ రాథోడ్, కిరోడి లాల్ మీనా మరియు దియా కుమారి ఉన్నారు. ఇక ఛత్తీస్‌గఢ్ నుంచి అరుణ్ సావో, గోమతి సాయి ఉన్నారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ ముఖ్యమంత్రి రేసులో ఉన్న బాబా బాలక్ నాథ్, రేణుకా సింగ్ ఇంకా రాజీనామా చేయకపోవడం గమనార్హం.

Exit mobile version