Site icon NTV Telugu

Indian Fishermen: మరో 10 మంది భారతీయ మత్స్యకారులని అరెస్ట్ చేసిన శ్రీలంక.. వరసగా రెండో సంఘటన..

Indian Fishermen

Indian Fishermen

Indian Fishermen: శ్రీలంక నేవీ మరో 10 మంది భారతీయ మత్స్యకారుల్ని అరెస్ట్ చేసి, వారి పడవల్ని స్వాధీనం చేసుకుంది. రెండు రోజుల క్రితం ఇలాగే 12 మందిని అరెస్ట్ చేసింది. శ్రీలంక జాఫ్నాలోని పాయింట్ పెడ్రోకి ఉత్తరాన ఆదివారం నాడు మత్స్యకారుల్ని అరెస్ట్ చేసినట్లు శ్రీలంక నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. పట్టుబడిన పది మంది మత్స్యకారులను కంకేసంతురై హార్బర్‌కు తరలించి తదుపరి చర్యల నిమిత్తం మైలాడి ఫిషరీస్ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగిస్తామని తెలిపారు.

Read Also: Mahindra XUV700: న్యూ మహీంద్రా XUV700 లాంచ్.. బండి మామూలుగా లేదుగా.. ధర, ఫీచర్లు ఇవే..

అంతకుముందు శనివారం ఇలాగే 12 మంది భారతీయ మత్స్యాకారుల్ని అరెస్ట్ చేసి, వారి మూడు పడవల్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా శ్రీలంక జలాల్లోకి వచ్చి చేపల్ని వేటాడుతున్నందుకు అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. భారత్, శ్రీలంకల మధ్య మత్స్యకారుల వివాదం వివాదాస్పదమవుతోంది. చేపల వేటకు వెళ్లే క్రమంలో భారతీయ జలాల నుంచి పొరబాటున శ్రీలంక జలాల్లోకి వెళ్తున్నారు.

గతంలో పాక్ జలసంధి వద్ద శ్రీలంక దళాలు భారతీయ మత్స్యకారులపై కాల్పులు కూడా జరిపాయి. పాక్ జలసంధి, శ్రీలంక నుండి తమిళనాడును వేరుచేసే ఇరుకైన నీటి స్ట్రిప్. ఈ రెండు ప్రాంతాల్లో ఇరు దేశాల మత్స్యకారులు చేపల వేటకు వెళ్తున్నారు. 2023లో శ్రీలంక నేవీ 240 మంది భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేయడంతో పాటు 35 ట్రాలర్లను స్వాధీనం చేసుకుంది.

Exit mobile version