NTV Telugu Site icon

Jharkhand Polls: 7 గ్యారంటీలతో జేఎంఎం కూటమి మేనిఫెస్టో విడుదల.. గ్యాస్ సిలిండర్ ఎంతంటే..!

Jharkhandpolls

Jharkhandpolls

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ-ఎం కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించింది. రాంచీలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, సీఎం హేమంత్‌ సోరెన్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఏడు హామీలతో ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశారు.

మేనిఫెస్టోలో ప్రధానంగా 10 లక్షల ఉద్యోగాలు, రూ.15 లక్షలతో ఆరోగ్య బీమా కవరేజీ వాగ్దానాలతో కూడిన మేనిఫెస్టో మంగళవారం విడుదల చేసింది. ఈ హామీలను ‘న్యాయ్ పాత్ర’ పేరుతో విడుదల చేశారు.

 

హామీలు ఇవే..

ఆహార భద్రతకు హామీ.. ప్రతి వ్యక్తికి నెలకు 7 కిలోల రేషన్
గ్యాస్ సిలిండర్ రూ.450
మహిళలకు నెలకు రూ.2,500 గౌరవ వేతనం
ఎస్టీలకు 28%, ఎస్సీలకు 12%, ఓబీసీలకు 27% రిజర్వేషన్లు
యువతకు 10 లక్షల ఉద్యోగాలు
పేదలకు రూ.15 లక్షల వరకు ఆరోగ్య బీమా
అన్ని బ్లాకుల్లో డిగ్రీ కళాశాలలు నిర్మాణం
జిల్లా కేంద్రంలో ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు
వరిపై ఎంఎస్‌పీని రూ.3,200కి పెంచనున్నారు
ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై MSP 50% పెరుగుతుంది
1932-ఆధారిత ఖతియాన్‌లో స్థానికత విధానం అమలు చేయబడుతుంది
సర్న ధర్మ కోడ్ అమలులోకి వస్తుంది

81 మంది సభ్యుల జార్ఖండ్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 13, 20 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్.. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) 30 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 25, కాంగ్రెస్ 16 సీట్లు గెలుచుకున్నాయి.

Show comments