Site icon NTV Telugu

Madhya Pradesh: విషపూరిత బావిలో పడిన వ్యాన్.. 10 మంది మృతి..

Madhya Pradesh

Madhya Pradesh

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. మందసౌర్ జిల్లాలో ఆదివారం ఓ వ్యాన్ బావిలో పడి 10 మంది మరణించారు. ఈ సంఘటన కచారియా గ్రామంలో జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, ఇతర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా మాట్లాడుతూ..డ్రైవర్‌ వ్యాన్‌పై నియంత్రణ కోల్పోయాడని, రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయిందని, బావిలో విషవాయువు ఉందని చెప్పారు. వ్యాన్‌లో ఇద్దరు పిల్లలతో సహా 13 మంది ఉన్నట్లు చెప్పారు.

Read Also: Sree Charani: పల్లెటూరు టు ఇంటర్నేషనల్.. టీమిండియాలోకి మరో కొత్త తెలుగమ్మాయి అరంగేట్రం..!

నలుగురు బావి నుంచి ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు, వీరిని ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్చారు. ప్రమాదానికి గురైన వారిని సాయం చేయడానికి బావిలోకి దిగిన వ్యక్తి మరణించారు. వాహనంలో 13 మంది ప్రయాణికులు ఉన్నారని, వీరిలో 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు డీఐజీ మనోజ్ కుమార్ సింగ్ చెప్పారు. మొత్తం ఈ దుర్ఘటనలో 10 మంది మరణించగా, నలుగురు సురక్షితంగా బయటపడినట్లు చెప్పారు.

Exit mobile version