Site icon NTV Telugu

Lakh Panipuris on Daughter Birthday: ఏకంగా లక్ష పానీపూరీలు పంచాడు.. ఎందుకో తెలుసా..?

Lakh Panipuris On Daughter Birthday

Lakh Panipuris On Daughter Birthday

Lakh Panipuris on Daughter Birthday: మన దేశంలోని మిలియన్ల మంది భారతీయులు ఎక్కువగా తినే ఇష్టమైనస్ట్రీట్ ఫుడ్‌ లో పానీపూరీ ఒకటి. మంచి మసాలాతో కూడిన ఆహారం తినాలని అనుకున్నప్పుడు మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పానీపూరీ. ఈ పదం వింటేనే చాలా మందికి నోరూరిపోతుంది. పానీపూరి స్టాల్స్, గోల్గప్పలు అని కూడా పిలుస్తారు. వీటిని మన దేశంలోని ప్రతి మూలలో చూడవచ్చు. ప్రతిరోజూ సాయంత్రం పానీపూరి బండి దగ్గరకు వెళ్లి ఒక ప్లేట్ పానీపూరీ లాగించకపోతే కొందరికి ఏం తిన్నా రుచించదు. కరోనాలాక్‌డౌన్ సమయంలోనూ పానీపూరీ బండ్లు పెట్టలేదని.. ఏకంగా ఇళ్లల్లోనే పానీపూరీలు చేసుకుని మరీ లాగించేశారు పానీపూరీ ప్రియులు. ఇలాంటి వారు మనదేశంలో పానీపూరీ లవర్స్ వున్నారు. తాజాగా.. ఉత్తరప్రదేశ్‌లోని శిఖోహాబాద్‌కి చెందిన ఓవ్యక్తి తాను ఇచ్చే పానీపూరీ తింటే రూ.500 ఇస్తా అని బెట్ కట్టిన విషయం తెలిసిందే.. కానీ ఒకతను మాత్రం ఒకటికాదు రెండు కాదు లక్ష పానీపూరీలు ప్రజలకు పంచాడు..! ఎందుకో తెలుసా..?

పిల్లల పుట్టినరోజు అంటే ఏం చేస్తాం.. కేక్ కట్ చేసి, పంచడం కామన్. కానీ మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన పానీపూరీ వ్యాపారి ఆంచల్ గుప్తా తన గారాలపట్టి జన్మదినం సందర్భంగా ఏకంగా 1,10,000 పానీపూరీలు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశాడు. ఇందుకోసం స్టాల్స్ ఏర్పాటుచేశాడు. గతేడాది కూతురు పుట్టినప్పుడు కూడా ఇలాగే ఫ్రీగా పానీపూరీలు అందించాడు. ఆడపిల్లలు అంటే తనకు చాలా ఇష్టమని, ‘బేటీ బచావో బేటీ పడావో’పై అవగాహన కోసం ఇలా చేశానన్నాడు. తన ఆడబిడ్డ మొదటి పుట్టి రోజు సందర్భంగా ఉచితంగా పానీ పూరీని పంపిణీ చేసి సంచలనం సృష్టించాడు ఆంచల్ గుప్తా. ఇందుకోసం 31 స్టాల్స్ ను ఏర్పాటు చేసి, ఉచితంగా పానీపూరీని పంపిణీ చేశాడు. మొత్తానికి కుమార్తె మొదటి పుట్టిన రోజున సుమారు 1,10,000 పానీపూరీలు ఉచితంగా పంపిణీ చేశాడు.
ఏదైతేనేం పానీపూరీలు మాత్రం వచ్చాయి. అక్కడి ప్రజలు తెగ ఆనందంగా పానీపూరీని లాగించేసారు.

Exit mobile version