Lakh Panipuris on Daughter Birthday: ఏకంగా లక్ష పానీపూరీలు పంచాడు.. ఎందుకో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakh Panipuris on Daughter Birthday: మన దేశంలోని మిలియన్ల మంది భారతీయులు ఎక్కువగా తినే ఇష్టమైనస్ట్రీట్ ఫుడ్ లో పానీపూరీ ఒకటి. మంచి మసాలాతో కూడిన ఆహారం తినాలని అనుకున్నప్పుడు మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పానీపూరీ. ఈ పదం వింటేనే చాలా మందికి నోరూరిపోతుంది. పానీపూరి స్టాల్స్, గోల్గప్పలు అని కూడా పిలుస్తారు. వీటిని మన దేశంలోని ప్రతి మూలలో చూడవచ్చు. ప్రతిరోజూ సాయంత్రం పానీపూరి బండి దగ్గరకు వెళ్లి ఒక ప్లేట్ పానీపూరీ లాగించకపోతే కొందరికి ఏం తిన్నా రుచించదు. కరోనాలాక్‌డౌన్ సమయంలోనూ పానీపూరీ బండ్లు పెట్టలేదని.. ఏకంగా ఇళ్లల్లోనే పానీపూరీలు చేసుకుని మరీ లాగించేశారు పానీపూరీ ప్రియులు. ఇలాంటి వారు మనదేశంలో పానీపూరీ లవర్స్ వున్నారు. తాజాగా.. ఉత్తరప్రదేశ్‌లోని శిఖోహాబాద్‌కి చెందిన ఓవ్యక్తి తాను ఇచ్చే పానీపూరీ తింటే రూ.500 ఇస్తా అని బెట్ కట్టిన విషయం తెలిసిందే.. కానీ ఒకతను మాత్రం ఒకటికాదు రెండు కాదు లక్ష పానీపూరీలు ప్రజలకు పంచాడు..! ఎందుకో తెలుసా..?
పిల్లల పుట్టినరోజు అంటే ఏం చేస్తాం.. కేక్ కట్ చేసి, పంచడం కామన్. కానీ మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన పానీపూరీ వ్యాపారి ఆంచల్ గుప్తా తన గారాలపట్టి జన్మదినం సందర్భంగా ఏకంగా 1,10,000 పానీపూరీలు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశాడు. ఇందుకోసం స్టాల్స్ ఏర్పాటుచేశాడు. గతేడాది కూతురు పుట్టినప్పుడు కూడా ఇలాగే ఫ్రీగా పానీపూరీలు అందించాడు. ఆడపిల్లలు అంటే తనకు చాలా ఇష్టమని, ‘బేటీ బచావో బేటీ పడావో’పై అవగాహన కోసం ఇలా చేశానన్నాడు. తన ఆడబిడ్డ మొదటి పుట్టి రోజు సందర్భంగా ఉచితంగా పానీ పూరీని పంపిణీ చేసి సంచలనం సృష్టించాడు ఆంచల్ గుప్తా. ఇందుకోసం 31 స్టాల్స్ ను ఏర్పాటు చేసి, ఉచితంగా పానీపూరీని పంపిణీ చేశాడు. మొత్తానికి కుమార్తె మొదటి పుట్టిన రోజున సుమారు 1,10,000 పానీపూరీలు ఉచితంగా పంపిణీ చేశాడు.
ఏదైతేనేం పానీపూరీలు మాత్రం వచ్చాయి. అక్కడి ప్రజలు తెగ ఆనందంగా పానీపూరీని లాగించేసారు.
Also Read
- PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
- Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
- PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
- Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
#MadhyaPradesh: Kolar's panipuri dad #AnchalGupta is back; celebrates #daughter's first #birthday by distributing over 1 lakh #freegolgappas#PaniPuri #Foodie #Food #India #MP #Kolar #Viral #Video #Indian #News #Trending #Bhopal pic.twitter.com/HKm7SugJcW
— Free Press Journal (@fpjindia) August 18, 2022
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
-
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
-
Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!