Prabhas: మూడు రోజుల్లో బర్త్ డే… అప్డేట్స్ మాత్రం జీరో రే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ సినిమా చూసిన ఈ జనరేషన్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ కలెక్షన్స్ ని రాబట్టగల సత్తా ఉన్న ఏకైక స్టార్ ప్రభాస్ మాత్రమే. ఆదిపురుష్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోని 500 కోట్లు రాబట్టింది, అది ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా. ఎన్ని ఫ్లాప్స్ పడినా ప్రభాస్ కి సరైన మాస్ సినిమా పడితే బాక్సాఫీస్ పునాదులు కదులుతాయి అని నిరూపించడానికి వస్తుంది సలార్ సినిమా. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా తెరకెక్కుతున్న సలార్ సినిమాని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సలార్ మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారెంటీ. సలార్ తర్వాత ప్రభాస్ నుంచి రానున్న మరో భారీ బడ్జట్ సినిమా కల్కి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తుంది. ఇండియన్ స్క్రీన్ పైన ఇప్పటివరకూ చూడని విజువల్ ని కల్కి సినిమా చూపించబోతుంది.
గ్రాండియర్ అనేది కూడా కల్కి ముందు చిన్న మాట అయిపోతుంది. రిలీజ్ కి రెడీ అవుతున్న కల్కి, సలార్ సినిమాలతో పాటు ప్రభాస్… మారుతీ డైరెక్షన్ ని ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ ప్రాజెక్ట్ జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ మూడు సినిమాలు ప్రభాస్ నుంచి షూటింగ్ లో ఉన్నాయి. ఇవి కాకుండా సందీప్ రెడ్డి వంగ, హను రాఘవపూడి సినిమాలు లూప్ లైన్ లో ఉన్నాయి. ఈ సినిమాలు సైమల్టేనియస్ గా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. పేరుకి ఇన్ని భారీ సినిమాలు ప్రభాస్ లిస్టులో ఉన్నాయి కానీ ఒక్క సినిమా నుంచి ఒక్క అప్డేట్ కూడా బయటకి రావట్లేదు. అకేషన్స్ పోతే పోనిలే అనుకోవచ్చు అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే ఉంది. సరిగ్గా 72 గంటలు మాత్రమే కౌంట్ డౌన్ ఉంది, అలాంటిది ప్రభాస్ చేస్తున్న సినిమాల నుంచి ఒక్క అప్డేట్ కూడా బయటకి రాలేదు. అప్డేట్ బర్త్ డే రోజున ఇస్తున్నాం అనే అనౌన్స్మెంట్ కూడా బయటకి రాలేదు. మరి ప్రభాస్ ఫ్యాన్స్ కోసం సడన్ సర్ప్రైజ్ లు ఏమైనా ప్లాన్ చేశారేమో చూడాలి.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!