NTV Telugu Site icon

Leo: హైప్ సరిపోవట్లేదు లోకేష్… మరో మాస్టర్ తీయట్లేదు కదా…

Leo

Leo

తనకంటూ ఒక క్రైమ్ వరల్డ్ ని క్రియేట్ చేసి, దానికి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని పేరు పెట్టి… సూర్య, కార్తీ, కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫజిల్ లాంటి హీరోలని ఆ సినిమాటిక్ యూనివర్స్ లోకి తీసుకోని వచ్చి ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచాడు ‘లోకేష్ కానగరాజ్’. విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన లోకేష్ ప్రస్తుతం విజయ్ తో చేస్తున్న సినిమా ‘లియో’. ఈ మూవీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కట్లేదు. మాస్టర్ సినిమా స్టైల్ లోనే స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గా రూపొందుతోంది. విజయ్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ‘మాస్టర్’. ఈ స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ ఆశించిన స్థాయి రిజల్ట్ ఇవ్వలేదు. అటు విజయ్ కి ఇటు లోకేష్ కి ఊహించని ఫ్లాప్ గా మాస్టర్ సినిమా నిలిచిపోయింది.

తనకి షాక్ ఇచ్చినా విజయ్ మాత్రం లోకేష్ ని నమ్మి ఇంకో సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఈ అవకాశాన్ని పూర్తిగా వాడుకుంటూ లియో సినిమాని జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసాడు లోకేష్. అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకి రానున్న లియో సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పుడు, ప్రమోషనల్ వీడియోస్ వదిలినప్పుడు బజ్ బాగానే జనరేట్ అవుతుంది కానీ విజయ్ కి సంబంధించిన పోస్టర్స్ వదిలినప్పుడు మాత్రం పెద్దగా సౌండ్ రావట్లేదు. విజయ్ లుక్స్ ని లోకేష్ పూర్తిగా మార్చి సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ స్టైల్ తో ఎదో కొత్తగా ట్రై చేసాడు. ఈ లుక్స్ విజయ్ చాలా ఏజ్డ్ గా కనిపిస్తున్నాడు. విజయ్ ని అలా ఎందుకు చూపించాల్సి వస్తుంది అనే విషయంలో క్లారిటీ రానంత వరకూ లియో సినిమా నుంచి విజయ్ పోస్టర్స్ ఎన్ని వచ్చినా బజ్ జనరేట్ అయ్యే అవకాశమే కనిపించట్లేదు. లేటెస్ట్ గా వదిలిన తెలుగు పోస్టర్స్ కైతే, అసలు అది పోస్టర్ కాదు. ఎదో వర్కింగ్ స్టైల్ కి టెక్స్ట్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు ఉంది. విజయ్ ‘నా రెడీ’ సాంగ్ లో చాలా మాస్ లుక్ లో ఉన్నాడు, అదే లుక్ లో ప్రమోషనల్ కంటెంట్ కూడా రిలీజ్ చేస్తే లియో సినిమా హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది లేదంటే లియో మూవీ బాక్సాఫీస్ దగ్గర మరో మాస్టర్ అవ్వకతప్పదు.

Show comments