Site icon NTV Telugu

Prema Vimanam: ZEE5 ఒరిజినల్ ‘ప్రేమ విమానం’కి అరుదైన గుర్తింపు

Prema Vimanam

Prema Vimanam

ZEE5’s Original movie Prema Vimanam shortlisted for Rajasthan International Film Festival 2024: ప్రముఖ ఓటీటీ మాధ్యమం ZEE5 రూపొందించిన ఒరిజినల్ మూవీ ‘పేమ విమానం’కు అరుదైన గుర్తింపు దక్కిందని అనౌన్స్ చేశారు. రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024కి తెలుగు నుంచి ఈ సినిమా ఎంపిక కావడం విశేషం. 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోన్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ పింక్ సిటీగా పేరున్న జైపూర్‌లో జనవరి 27 నుంచి 31 వరకు జరనుందని తెలుస్తోంది. జ్యూరీ కమిటీ సభ్యులు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఐదు జాతీయ చిత్రాలు, ఏడు ప్రాంతీయ చిత్రాలు, మూడు అంతర్జాతీయ చిత్రాలను ఎంపిక చేశారు. ఇక ప్రేమ విమానం సినిమాతో పాటు తెలుగు నుంచి మంగళవారం, మధురపూడి గ్రామం అనే నేను సినిమాలు కూడా ఈ ఫెస్టివల్‌కి ఎంపిక కావటం గమనార్హం. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీతో మెప్పించిన సంగీత్ శోభన్ మరోసారి తనదైన నటనతో ప్రేమ విమానం చిత్రంలో అలరించగా ఆయనకు జోడీగా సాన్వి మేఘన నటించింది.

Pallavi Prashanth: రైతు బిడ్డ ఒరిజినాలిటీ.. విన్నర్ అయ్యాక బలుపు చూపిస్తున్న పల్లవి ప్రశాంత్

వీరితో పాటు అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా తనయులు అనిరుద్, దేవాంశ్ చక్కటి నటనతో సినిమాలోని భావోద్వేగాలను మరింత కనెక్ట్ అయ్యేలా చేశారు. ఈ చిత్రానికి సంతోష్ కాటా దర్శకత్వం వహించారు. ప్రేమ విమానం చిత్రంలోని పాత్రల మధ్య ఉండే ఎమోషన్స్ ఆడియెన్స్‌ని అలరించాయి. ప్రేమను బతికించుకోవటానికి ప్రేమ జంట చేసే పోరాటం, విమానం ఎక్కాలనుకునే చిన్న పిల్లలు, వారికి తల్లితో ఉన్న అనుబంధం ఇలాంటి పాత్రల చుట్టూ సినిమా రన్ అవుతుంది. దేవాంశ్, అనిరుధ్‌లు వారి అమాయకమైన నటన, ఎమోషన్స్‌తో హృదయాలను ఆకట్టుకున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను మరింత అద్భుతంగా కనెక్ట్ అయ్యేలా చేశాయి. సినిమాటోగ్రాఫర్ జగదీష్ చీకటి రియలిస్టిక్, నేచురల్‌గా సన్నివేశాలను తెరకెక్కించిన తీరు చక్కటి విజువల్ అప్పియరెన్స్‌నిచ్చింది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Exit mobile version