Site icon NTV Telugu

Zee5 : విరాటపాలెం వివాదంపై జీ5 క్లారిటీ..

Zee5

Zee5

Zee5 : విరాటపాలెం : పిసి మీనా రిపోర్టింగ్ వివాదంపై తాజాగా జీ5 స్పందించింది. ఈ సిరీస్ పై ఈటీవీ విన్ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. తాము రూపొందించినజీ కానిస్టేబుల్ కనకంని జీ5 వాళ్లు కాపీ కొట్టి విరాటపాలెం తీశారంటూ డైరెక్టర్ ప్రశాంత్ ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించారు. కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ రోజు స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా దీనిపై జీ5 సంస్థ స్పందించింది. తాము ఎలాంటి కాపీ కొట్టలేదని కుండబద్దలు కొట్టేసింది.

Read Also : Kubera vs Kannappa : కుబేరపై కన్నప్ప ఎఫెక్ట్ పడుతుందా..?

ప్రశాంత్ దిమ్మల చేసిన ఆరోపణల్లో నిజం లేదని చెప్పింది. కోర్టు తీర్పు వచ్చే వరకు ప్రశాంత్ ఇలాంటి ప్రకటనలు చేయొద్దని కోరింది. ప్రశాంత్ సొంత కథకు, తమ విరాటపాలెం కథకు ఎక్కడైనా పొంతన ఉందో ఒకసారి ప్రివ్యూ చూసి చెక్ చేసుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది. ఎలాంటి సాక్ష్యాలు లేకుండానే ఆరోపణలు చేయొద్దని జీ5 కోరింది.

జీ5 ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రకటనలు చేయడాన్ని తాము ఖండిస్తున్నట్టు తెలిపింది. వారిపై తాము చట్టపరమైన చర్యలకు దిగుతున్నట్టు తెలిపింది. జీ5 కాపీ కంటెంట్ ను అస్సలు ఎంకరేజ్ చేయదని చెప్పేసింది.

Read Also : Thamannah : దంగల్ బ్యూటీతో విజయ్ వర్మ డేటింగ్.. తమన్నా షాకింగ్ పోస్ట్..

Exit mobile version