ప్రత్యేక కార్యక్రమాలతో మరింత వినోదం పంచుతున్న జీ తెలుగు తాజాగా మంచిర్యాల వేదికగా అభిమానులకు అద్భుత అవకాశాన్ని అందించింది. విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జీ తెలుగు సీరియల్స్ జగద్ధాత్రి, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నటీనటులతో పాటు ఇటీవల ఘనంగా ప్రారంభమైన మా అన్నయ్య సీరియల్ నటీనటులు తమ అభిమానులను నేరుగా కలిసేందుకు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించింది. జగద్దాత్రి ఇంట మిత్ర, లక్ష్మీల కలయిక పేరున జరిగిన ఈ కార్యక్రమం ఈ ఆదివారం జీ తెలుగులో ప్రసారం కానుంది. బుల్లితెరపై అలరిస్తున్న జగద్ధాత్రి(దీప్తి మన్నె)-కేదార్(దర్శ్ చంద్రప్ప), మిత్రనందన్ (రాఘవేంద్ర)-లక్ష్మీ(మహీ గౌతమి) జంటలు ఆడిన టవల్ లాకింగ్ గేమ్, సరదా ఛాలెంజ్‌లు,ఉట్టి కొట్టడం, అంత్యాక్షరి ఉత్సాహంగా సాగాయి. ఒక్కో రంగుకి ఉన్న అర్థాన్ని సీరియల్స్‌లో చూపించే భావోద్వేగాలను జోడించి చెప్పడం.. వంటి కార్యక్రమాలతో హోలీ సంబరం సరదాగా సాగింది. యాంకర్ శ్యామల వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకులకు వినోదం పంచింది. జీ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న’జగద్ధాత్రి’, ‘చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి’నటీనటులు ఈ వేదికపై నుంచి తమఅభిమానులతో సంభాషించడమే కాకుండా పలు బహుమతులను కూడా పంచి వారి సంతోషంలో పాలుపంచుకున్నారు.
ఈ రెండు సీరియల్స్ నటీనటులతో పాటు మా అన్నయ్య సీరియల్ నటీనటులు కూడాఅభిమానులను పలకరించారు. అంతేకాదు వారు అడిగిన సందేహాలకు సమాధానాలు కూడా ఇచ్చి అందరినీ అలరించారు. డ్రామా జూనియర్స్ పిల్లల ప్రదర్శనలు, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ హృదయాన్ని కదిలించే గానం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి’, ‘జగద్దాత్రి’ సీరియల్స్ నటీనటుల గ్రాండ్ ఎంట్రీ, సంభాషణలు, బహుమతులు వీక్షకుల్లో ఉత్సాహం నింపాయి. అంతేకాదు ఈ వేదికపై జరిగిన మిత్ర(రఘునందన్)-లక్ష్మీ(మహీ గౌతమి)ల పెళ్లి అందరినీ ఆకట్టుకుంది. మా అన్నయ్య సీరియల్ నటుడైన గోకుల్ మీనన్‌కి మంచిర్యాలకి చెందిన వికలాంగురాలు రాఖీ కట్టడం ప్రేక్షకులను అబ్బురపరిచింది. జీ తెలుగు నటీనటులు తమ అభిమానులతో సెల్ఫీలు దిగడం, బహుమతులతో సర్ ప్రైజ్ చేయడంతోపాటు వారిని పలకరించి ముచ్చటించారు. నటీనటులు చెరగని అనుభూతులు పంచారు. ఘనంగా జరిగిన ఈ సరదా సంబరాన్ని జీ తెలుగు వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకు చూడచ్చు.