2021లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో “కేజీఎఫ్-2” ఒకటి. యష్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న “కేజీఎఫ్-2” మూవీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సీక్వెల్‌లో యష్, సంజయ్ దత్, రవీన్ టాండన్, రావు రమేష్, శ్రీనిధి శెట్టి వంటి భారీ తారాగణం ఉంది, రవి బస్రూర్ సంగీతం అందించారు, హోంబలే ఫిల్మ్స్ నిర్మించారు, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కావాల్సి ఉంది. కానీ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
Read Also : వైష్ణవ్ తేజ్ చిత్రం టైటిల్ ఖరారు
ఇంతకుముందు “కేజీఎఫ్-2” ఓటిటి విడుదలకు భారీ ఆఫర్లు వచ్చాయి. కానీ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని మేకర్స్ గట్టిగా నిర్ణయించుకున్నారు. థియేట్రికల్ విడుదల తర్వాత మాత్రమే, ఈ చిత్రం ఓటిటిలో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే “కేజీఎఫ్-2” టీజర్ సంచలనం సృష్టించింది. దీంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా అన్ని భాషల శాటిలైట్ రైట్స్ ని జీ టీవీ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ పాన్ ఇండియన్ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానుంది.