Site icon NTV Telugu

Yuvasudha: యువసుధ కార్యాలయం ప్రారంభం

Yuvasudha Productions

Yuvasudha Productions

Yuvasudha Production House Launched: దర్శకుడు కొరటాల శివ స్నేహితుడు, ప్రముఖ పంపిణీదారుడు మిక్కిలినేని సుధాకర్ ఎన్టీఆర్ సినిమాతో నిర్మాతగా మారారు. డిస్ట్రిబ్యూషన్ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ ఎన్టీఆర్30 సినిమాతో కెరీర్‌లో నిర్మాతగా ముందడుగు వేస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్ పతాకంపై కొరటాల శివ దర్శకత్వంలో నిర్మించబోతున్న సినిమాకు సంబంధించి ఆదివారం హైదరాబాద్ లో ప్రొడక్షన్ హౌస్ ను ఆరంభించారు.

ఈ ప్రారంభోత్సవంలో కొరటాల శివ, దిల్ రాజు, డివివి దానయ్య పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీతో అమెరికా విహార యాత్రలో ఉండటంతో హాజరు కాలేదు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ తో కలసి యువసుధ సంస్థ నిర్మిస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలనేని సుధాకర్, హరికృష్ణ నిర్మాతలుగా రాబోతున్న ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version