యంగ్ హీరో కార్తికేయ “ఆర్ఎక్స్ 100″తో తెలుగు సినిమాలో తన సత్తా నిరూపించుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్న ఈ యంగ్ హీరో సైలెంట్ గా ఎంగేజ్మెంట్ కానిచ్చేశాడు. తాజాగా ఆయన నిశ్చితార్థానికి సంబంధించిన పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ యంగ్ హీరో నిన్న తన కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగిన వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇది లవ్ ఆమ్యారేజ్ కాదు అరేంజ్డ్ వెడ్డింగ్. పెళ్ళికి సంబంధించిన తేదీ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది.
Read Also : చిరు విషయంలో బండ్ల గణేష్ కొత్త డిమాండ్
కార్తికేయ తన నిశ్చితార్థానికి సంబంధించిన విషయాన్ని, పెళ్లి వేడుకను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా కార్తికేయ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కార్తికేయ “రాజా విక్రమార్క” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ నిన్ననే పూర్తయ్యింది. అది త్వరలో విడుదల కానుంది. ఆ తరువాత కార్తికేయ యూవి క్రియేషన్స్‌తో కలిసి ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కోసం పని చేయబోతున్నాడు.