Site icon NTV Telugu

Jr NTR : నారా లోకేష్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే విషెష్

Jr Ntr

Jr Ntr

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ పుట్టిన రోజు నేడు. యువగళం పేరుతో తనని తానూ ప్రజలకు సరికొత్తగా పరిచయం చేసుకుని 2024 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రజాసేవలో తనదైన మార్క్ చూపిస్తూ తన నియోజక వర్గం మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ ను కూడా అభివృద్ధి పదంలోకి నడిపించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాడు.

Also Read : Swayambhu : నిఖిల్ స్వయంభు కొత్త రిలీజ్ డేట్ ఇదే

పెట్టుబడులే లక్ష్యంగా ప్రస్తుతం డావోస్ పర్యటనలో ఉన్న లోకేష్ కు రాజకీయ, సినీ ప్రముఖుల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో నారాలోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ విషెష్ తెలుపుతూ’ పుట్టిన రోజు శుభాకాంక్షలు నారా లోకేష్ మీకు ఈ ఏడాది మరొక అద్భుతమైన సంవత్సరం అవ్వలని కోరుకుంటున్నాను’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నారా – నందమూరి అభిమానులు ఎన్టీఆర్ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్వీట్ కు నారా లోకేష్ రిప్లై ఏమిస్తాడా అని ఎదురుచూస్తున్నారు.

Exit mobile version