తెలుగు సినిమా దిగ్గజం… తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన వాళ్లలో ముఖ్యుడు స్వర్గీయ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. సినీ అభిమానులతో ఏఎన్నార్, నాగి గాడు అని ప్రేమగా పిలిపించుకున్న ఈ దసరా బుల్లోడు. తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. ఎన్టీఆర్-ఏఎన్నార్ లు తెలుగు సినిమాకి చేసిన సేవ తారలు గుర్తుంచోకోవాల్సినది. స్టార్ హీరోలుగానే కాదు మంచి స్నేహితులుగా ఎలా ఉండాలో కూడా ఎన్టీఆర్-ఏఎన్నార్ లని చూసి నేర్చుకోవాల్సిందే. అందుకే నందమూరి కుటుంబ సభ్యులు, అక్కినేని కుటుంబ సభ్యులు అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. తరాలు మారుతున్న రెండు కుటుంబాల మధ్య బంధం మాత్రం మారలేదు. జనరేషన్స్ ఆ రిలేషన్స్ ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. ఇటీవలే ఎన్టీఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సంధర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, నాని, విష్ణు, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు వచ్చారు. నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ లు గెస్టులని వెల్కమ్ చేసారు. ఈ వేడుకకి నందమూరి కుటుంబం నుంచి ఎవరూ హాజరు కాలేదు. ఎంతో సన్నిహితంగా ఉండే ఎన్టీఆర్ కూడా వెళ్లలేదు. ఎన్టీఆర్-నాగార్జునని బాబాయ్ బాబాయ్ అని ప్రేమగా పిలుస్తాడు. అలాంటి బాబాయ్ ఎన్టీఆర్ ని పిలవలేదా? లేక పిలిచినా ఎన్టీఆర్ వెళ్లలేదా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది. అయితే ఎన్టీఆర్ ఈ విగ్రహ ఆవిష్కరణకి రాకపోవడానికి కారణం దేవర షూటింగ్ అని తెలుస్తోంది. దుబాయ్ నుంచి తిరిగొచ్చిన ఎన్టీఆర్, దేవర షూటింగ్ ని మళ్లీ మొదలుపెట్టాడు. ఈ షూటింగ్ లో ఉన్న కారణంగానే ఎన్టీఆర్, ఏఎన్నార్ విగ్రహ ఆవిష్కరణకి రాలేదని సమాచారం.
