యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. మే 28న అన్నగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కి తారక్ వెళ్లిన సమయంలో వీడియోస్ అండ్ ఫొటోస్ బయటకి వచ్చాయి. ఈ ఫొటోస్ సోషల్ మీడియా అంతా వైరల్ అవుతూనే ఉన్నాయి. మార్నింగ్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర వైట్ షర్ట్ లో కనిపించిన ఎన్టీఆర్, ఈవెనింగ్ కి బ్లాక్ అండ్ బ్లాక్ లో ఎయిర్పోర్ట్ దగ్గర కనిపించాడు. ఫ్యామిలీతో పాటు ఫారిన్ ట్రిప్ కి రెడీ అయిన ఎన్టీఆర్, షార్ట్ పీరియడ్ వెకేషన్ కి వెళ్లాడు. ఈ సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ తో పాటు ఫ్యామిలీ ఫొటోస్ కూడా ఉండడంతో ఫాన్స్ ఫొటోస్ ని ట్రెండ్ చేస్తున్నారు. దాదాపు వారం రోజుల పాటు ఉండే ఈ ట్రిప్ ని కంప్లీట్ చేసుకోని ఎన్టీఆర్ తిరిగి వచ్చేస్తాడని సమాచారం.
ఆ తర్వాత దేవర కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వనుంది. జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘దేవర’. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జట్ లో రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రీసెంట్ గా బయటకి వచ్చి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో నెవర్ బిఫోర్ యాక్షన్ ఎపిసోడ్స్ తో కొరటాల శివ ఒక బిగ్గర్ వరల్డ్ ని ఎన్టీఆర్ కోసం క్రియేట్ చేసాడు. దీని కోసం హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ ని కూడా రప్పించాడు. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.