Site icon NTV Telugu

NTR Nagarjuna: హ్యాపీ బర్త్ డే బాబాయ్… ఇది కదా నందమురి అక్కినేని ఫ్యాన్స్ బాండింగ్

Ntr Nagarjuna

Ntr Nagarjuna

ఈరోజు అక్కినేని కింగ్ నాగార్జున బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఒక పక్క మన్మథుడు సినిమా రీరిలీజ్, ఇంకోపక్క ‘నాగ్ 99’ ప్రోమోతో ఆన్ లైన్ ఆఫ్ లైన్ లలో ఫాన్స్ చేస్తూన్న హంగామా మాములుగా లేదు. నాగార్జున బర్త్ డే కాబట్టి అక్కినేని ఫ్యాన్స్ హంగామా చేయడంలో తప్పు లేదు కానీ ఈ ఫ్యాన్స్ జోష్ ని మరింత పెంచుతూ నందమూరి ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్ తో కలిసి నాగార్జునకి బర్త్ డే విషెష్ చెప్తున్నారు. హ్యాపీ బర్త్ డే బాబాయ్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాగార్జునకి విషెష్ చెప్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్న ఈ మ్యూచువల్ ఫ్యాన్స్, హీరోల అభిమానులు ఎలా ఉండాలో తెలియజేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, నాగార్జునని బాబాయ్ అని ప్రేమగా పిలుస్తాడు అనే విషయం తెలిసిందే. నాగార్జున కూడా హరికృష్ణని అన్నగా, ఎన్టీఆర్ ని పెద్ద కొడుకుగా పిలుస్తూ ఉంటాడు. ఎన్నోసార్లు ఓపెన్ గా చెప్పున ఈ విషయాన్నీ నాగార్జున-ఎన్టీఆర్ లు కలిసే అడ్రెస్ చేసారు.

అక్కినేని అఖిల్ కి ఎన్టీఆర్ ని చూపించి మా పెద్దబ్బాయి తారక్ ని చూసి మాస్ నేర్చుకోరా అని నాగార్జున స్టేజ్ పైనే చెప్పాడు అంటే ఈ ఇద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి ఇప్పుడే కాదు ఎన్టీఆర్-ఏఎన్నార్ ల కాలం నుంచే నందమూరి అక్కినేని అభిమానుల మధ్య చాలా మంచి రిలేషన్ ఉంది. తెలుగు సినిమాకి రెండు కళ్లలా ఉన్న ఎన్టీఆర్-నాగేశ్వర రావు, నిజ జీవితంలో కూడా అన్నదమ్ముల్లా ఉండే వారు. అందుకే తారలు మారినా నందమూరి అక్కినేని అభిమానుల మధ్య ఆ బంధం అలానే కొనసాగుతూ వచ్చింది. అయితే ఎన్టీఆర్-ఏఎన్నార్ కలిసి నటించారు కానీ బాలకృష్ణ-నాగార్జున మాత్రం కలిసి నటించలేదు. నాగార్జున-జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించే అవకాశం రెండు మూడు సార్లు వచ్చింది కానీ ఆ ప్రాజెక్ట్స్ వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ నాగ చైతన్య-ఎన్టీఆర్ కలిసి అయినా మిస్సమ్మ లాంటి సినిమాని చేస్తారని నందమురి అక్కినేని మ్యూచువల్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి వీరి వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో చూడాలి.

Exit mobile version