యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2016లో జనతా గ్యారేజ్ సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ సైమా అవార్డుని గెలుచుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఏడేళ్లకి ఇప్పుడు ఎన్టీఆర్ మరోసారి బెస్ట్ యాక్టర్ సైమా అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రకి ప్రాణం పోసినందుకు… వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసినందుకుగాను ఎన్టీఆర్ ని ఈ అవార్డ్ లభించింది. ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్, దుల్కర్ సల్మాన్, అడవి శేష్, నిఖిల్ సిద్దార్థ్ కూడా బెస్ట్ యాక్టర్ అవార్డ్ రేస్ లో ఉన్నారు కానీ వారిని వెనక్కి నెట్టి మరీ ఎన్టీఆర్ ఈ అవార్డుని గెలుచుకున్నాడు. దీంతో ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. #ManofMasses #NTR #Devara టాగ్స్ ని ట్రెండ్ చేస్తూ నందమూరి ఫ్యాన్స్, డై హార్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరోసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ దేవర సినిమాని చేస్తున్నాడు. కొరటాల శివ డైరెక్టర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న దేవర సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మీట్ అయితే చాలు కొరటాల శివ-ఎన్టీఆర్ లు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ. ఎన్టీఆర్-శివలకి అనిరుద్ కూడా కలుస్తున్నాడు కాబట్టి పాన్ ఇండియా సంభవం జరగడం పక్కా. మరి వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఎన్టీఆర్ దేవర సినిమాతో ఏ రేంజ్ హిట్ అందుకుంటాడు అనేది చూడాలి.
His electrifying performance in RRR stole all our hearts! He has won the Best Actor in a Leading Role (Telugu) for the same. Congratulations, @tarak9999! Thank you for delivering an unforgettable performance.#NEXASIIMA #DanubeProperties #A23Rummy #HonerSignatis #Flipkart… pic.twitter.com/9zt5QxTsnd
— SIIMA (@siima) September 15, 2023