Sreeleelaa: ధమాకా పాప బన్నీనే రిజెక్ట్ చేసిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ బ్యూటీ శ్రీలీల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను రిజెక్ట్ చేసిందా? అంటే, ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అసలు శ్రీలీల ఏంటీ, బన్నీని రిజెక్ట్ చేయడం ఏంటి? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కానీ శ్రీలీల నో చెప్పడానికి బలమైన రీజనే ఉంది. శ్రీలీలకు బన్నీతో వచ్చిన ఛాన్స్ హీరోయిన్‌గా కాదట. అందుకే ఏ మాత్రం ఆలోచించకుండా నో చెప్పేసిందట. పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా.. అంటూ సామ్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. అందుకే పుష్ప2లోను అదిరిపోయే ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. అందుకోసం ఓ రేంజ్ ఉన్న హీరోయిన్‌తో స్టెప్పులేయించాలని అనుకుంటున్నాడు.
ఇప్పటివరకు పలువురు బాలీవుడ్ ముద్దుగుమ్మలు పేర్లు జోరుగా వినిపించాయి. కానీ ఫైనల్‌గా శ్రీలీల అయితే ఐటెం సాంగ్ అదిరిపోతుందని అనుకున్నాడట. రీసెంట్‌గా శ్రీలీలను సంప్రదించి, భారీ మొత్తంలో ఆఫర్ చేశారట మేకర్స్. అయినా కూడా శ్రీలీల నో చెప్పిందట. ప్రజెంట్ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదు. అమ్మడు స్టెప్ వేస్తే.. థియేటర్లు షేక్ అయిపోవాల్సిందే. అందుకు నిదర్శనమే ధమాకా సినిమా అని చెప్పొచ్చు. పైగా ఈ యంగ్ బ్యూటీ చేతిలో దాదాపు పది ప్రాజెక్టులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఐటెం సాంగ్ అంటే.. తన కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందనే ఆలోచనతో పుష్పరాజ్‌తో ఐటెం సాంగ్ రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే.. ఇప్పటికే పవన్, మహేష్‌లతో కలిసి రొమాన్స్ చేస్తోంది శ్రీలీల. కాబట్టి అమ్మడికి బన్నీతో నటించే ఛాన్స్ త్వరలోనే వస్తుందని చెప్పొచ్చు.
Also Read
- Matsya: పడవ కింద నుంచి వెళ్లిన 'మిథికల్ ఫిష్'.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ 'మత్స్య'!
- Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
- world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. 'భోగి' టీజర్ రిలీజ్
తాజావార్తలు
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!