NTV Telugu Site icon

Thiruveer: వరుస సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరో..

February 7 (33)

February 7 (33)

ఇండస్ట్రీలో ఫేమ్ సంపాదించుకోవడం అంత ఈజీ కాదనే విషయం మనకు తెలిసిందే. మంచి బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన హీరోలు కూడా హిట్ లు లేక సతమతమవుతున్నారు. ఇలాంటి సిచువేషన్ లో చిన్న హీరోలు క్రేజ్ సంపాదించుకోవడం అనేది నిజంగా ఛాలెంజ్ తో కూడుకున్న పని. ఇలాంటి పరిస్థితిలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు హీరో తిరువీర్.‘జార్జి రెడ్డి, పలాస 1978’, ‘మసూద’ వంటి చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.ఇందులో ‘మసూద’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది దీంతో తన కెరీర్‌కి బాగా కలిసోచ్చింది.

Also Read:Samantha: మొదటి సారిగా నాగచైతన్య రెండో పెళ్లి గురించి స్పందించిన సమంత ..!

ప్రస్తుతం ఈ యంగ్ హీరో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇందులో ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ అనే చిత్రం ఒకటి. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందట. ఈ సినిమాలో తిరువీర్ ఫోటోగ్రాఫర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తిరువీర్ తన కెరీర్‌కి సంబందించిన విషయాలు పంచుకున్నాడు..

తిరువీర్ మాట్లాడుతూ.. ‘ ఈ ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ మూవీలో వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పాత్రను పోషించడం చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మొబైల్‌తో చాలాసార్లు ఫోటోలు తీశాను.. కానీ ఇలా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా నటించడం, ఫొటోలు తీయడం చాలా కొత్తగా, ఛాలెంజింగ్‌గా అనిపిస్తోంది. స్టిల్స్ ఎలా పెట్టించాలి, కెమెరాను ఎలా పట్టుకోవాలి.. ఇలా చాలా విషయాలు నేర్చుకున్నాను. అందరినీ ఎంటర్‌టైన్ చేసేలా ఈ సినిమా ఉంటుంది. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ లు కూడా చేస్తున్నా.. నా కోసమే దర్శకులు పాత్రలను రాస్తుండటం చాలా హ్యాపీగా ఉంది’ అని తెలిపాడు.