NTV Telugu Site icon

Sree Vishnu: హిట్ కోసం ‘గే’ గా మారిన హీరో..?

Sri Vishnu

Sri Vishnu

Sree Vishnu: టాలీవుడ్ లో విభిన్నమైన కథలను ఎంచుకొని గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో శ్రీ విష్ణు ఒకడు. గతేడాది అల్లూరి వంటి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేపోయింది. దీంతో ఈసారి ఎలా అయినా శ్రీ విష్ణు మంచి హిట్ కొట్టాలని ఎంతో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక నేడు ఈ హీరో తన కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించాడు. వివాహా భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు నటిస్తున్న చిత్రం ‘సామజవరగమనా’. హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విష్ణు సరసన బిగిల్ ఫేమ్ రెబా మోనికా జాన్ నటిస్తోంది.

#BoyapatiRAPO: అమ్మ దీనమ్మ.. ఏం ఉన్నావ్ బాసూ..

నేడు ఈ సినిమాను రిలీజ్ చేస్తూ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. అయితే ఈ సినిమా కోసం శ్రీ విష్ణు ఒక పెద్ద రిస్క్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఈ హీరో గే పాత్రలో కనిపిస్తున్నాడట. ఆ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉండడంతో కాదనకుండా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఒకప్పుడు హాలీవుడ్, బాలీవుడ్ లో ఉండే ఈ గే పాత్రలు ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఈ మధ్యనే హీరో సుధీర్ బాబు హంట్ సినిమాలో గే పాత్రలో కనిపించాడు. అయితే ఈ పాత్ర అతనికి సెట్ అవ్వలేదు.. మరి శ్రీ విష్ణుకు ఏమైనా కలిసి వస్తుందేమో చూడాలి.

Show comments