Grey movie: ‘ఆలస్యం అమృతం’ మూవీలో సపోర్టింగ్ రోల్ చేసి మెప్పించిన అరవింద్ కృష్ణ ఆ తర్వాత పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషించాడు. ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’, ‘అడవి కాచిన వెన్నెల’ సినిమాలతో పాటు ‘ఋషి’లో మెడికోగా నటించి ఆడియెన్స్ ను మెప్పించాడు. ‘ఈడు గోల్డ్ ఎహె’లో విలన్ గా నటించిన అరవింద్ కృష్ణ ‘ప్రేమమ్’లో శ్రుతిహాసన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక అరవింద్ కృష్ణ నటించిన ‘శుక్ర’ సినిమా అయితే అమెజాన్ ప్రైమ్ లో చాలా వారాల పాటు ట్రెండ్ అయ్యింది. ‘రామారావు ఆన్ డ్యూటీ’లో విలన్ గా నటించిన అరవింద్ కృష్ణ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పెద్దన్న’ మూవీలో కీర్తి సురేశ్ సరసన నటించాడు. అలానే సూపర్ హీరో మూవీ ‘ఏ మాస్టర్ పీస్’లోనూ అరవింద్ కృష్ణ నటిస్తున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు కాగా, అరవింద్ కృష్ణతో ‘ఋషి’ సినిమాను తెరకెక్కించిన రాజ్ మాదిరాజు ఇప్పుడు ‘గ్రే’ మూవీని తీశారు. ‘ది స్పై హూ లవ్డ్ మీ’ అనేది దాని ట్యాగ్ లైన్. ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతన్ నటించిన చివరి సినిమా ఇదే! ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘గ్రే’ మూవీ ఈ నెల 26న రాబోతోంది. ఇందులో అరవింద్ కృష్ణతో పాటు అలీ రెజా, ఊర్వశీరాయ్ కీలక పాత్రలు పోషించారు.
విశేషం ఏమంటే.. అరవింద్ కు ఇప్పుడు ఇతర భాషల్లోనూ ఆఫర్లు వస్తున్నాయి. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లోనూ చేస్తున్నాడు. కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ అరవింద్ తనదైన మార్క్‌ను చూపిస్తున్నాడు. యాక్టింగ్ తో పాటు స్పోర్ట్స్ కూ అరవింద్ కృష్ణ ప్రాధాన్యమిస్తుంటాడు. బాస్కెట్ బాల్ ఆటలో అరవింద్ కృష్ణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. ఎలైట్ ప్రో బాస్కెట్ బాల్ లీగ్‌లో హైద్రాబాద్ తరపున అరవింద్ ఆడుతున్నాడు. మరి ఈ రెండు రంగాలను బాలెన్స్ చేస్తూ రాబోయే రోజుల్లో అరవింద్ కృష్ణ ఇంకెన్ని వండర్స్ సృష్టిస్తాడో చూడాలి!