Site icon NTV Telugu

Rithika Singh : అందాల ఆరబోతకు డోర్స్ ఓపెన్ చేసిన యంగ్ బ్యూటీ

Ritika Singh

Ritika Singh

ఎంటర్ టైన్ మెంట్ రంగాన్ని ఏలేద్దామని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాక్సర్ రితికా సింగ్‌ను ఆడియన్స్ లైట్ తీసుకుంటున్నారు. ఇరుది సుట్రుతో ఏక కాలంలో కోలీవుడ్, బాలీవుడ్‌లో అడుగుపెట్టిన రితికా. ఇదే రీమేక్‌ గురుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఈ భామ పెద్దగా క్లిక్ కాలేదు కానీ తమిళ ఇండస్ట్రీనే అడపాదడపా ఆఫర్లు ఇచ్చి ఆదుకుంది. శివలింగ, ఓ మై కడవలే చిత్రాల్లో మెరిసింది అమ్మడు.

Also Read : Kuberaa : కుబేర ఓవర్శీస్ రివ్యూ..

తెలుగులో ముచ్చటగా మూడు చిత్రాలతో సరిపెట్టేసిన రితికా కోలీవుడ్ పైనే ఆశలు పెట్టుకుంది. కానీ వరుస ప్లాపులు ఆశలన్నీ నీరుగార్చేస్తున్నాయి. గత ఏడాది వెట్టయాన్ చిత్రంలో పలకరించింది ఈ ప్రొఫెషనల్ బాక్సర్. రజనీ వన్ మ్యాన్ షో, భారీ కాస్టింగ్‌తో మేడమ్ చేసిన పోలీసాఫీసర్ పాత్ర పెద్దగా రిజిస్టర్ కాలేదు. ఈ సినిమా కూడా ప్లాప్ కావడంతో రితికా సింగ్ కెరీర్ మరింత డైలామాలో పడింది. ప్రజెంట్ ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్క మూవీ ఉంది. అరవింద్ స్వామి హీరోగా చేస్తోన్న వనంగమూడిలో నటిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ప్లాపులు, ఆఫర్లు కూడా రాకపోవడంతో రితికా సింగ్ రూట్ మార్చింది. సోషల్ మీడియా అనే దునియాలో అందమనే ఆయుధాన్ని ఎరగా వేస్తోంది. గ్లామర్ డోర్లు తెరచి మునుపెన్నుడూ లేనంతంగా ఎక్స్ పోజింగ్ చేస్తూ హీట్ పుట్టిస్తోంది. హాట్ ఫోజులతో మతిపోగొడుతూ ఫిల్మ్ మేకర్లకు అటెన్షన్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరీ ఈ ఫోటో షూట్స్ ఆమెకు అవకాశాలను తెచ్చిపెడతాయా. వ్రతం చెడినా రితికాకు ఫలితం దక్కుతుందో లేదో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

Exit mobile version