Site icon NTV Telugu

Yendira Ee Panchayithi: నువ్వేమైనా అర్జున్ రెడ్డి సినిమా హీరో అనుకుంటున్నావా?

'yendira Ee Panchayithi' Glimpse

'yendira Ee Panchayithi' Glimpse

Yendira Ee Panchayithi Glimpse: విలేజ్ డ్రామా, లవ్ స్టోరీలను ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారని ఈ మధ్య అనేక సినిమాలు ప్రూవ్ చేశాయి. ప్రేమ కథలను కొత్తదనంతో అందంగా చూపిస్తూ ప్రస్తుతం యంగ్ మేకర్స్ విజయాలు సాధిస్తున్న క్రమంలో ఇప్పుడు ‘ఏందిరా ఈ పంచాయితీ’ అనే సినిమా కూడా రాబోతోంది. ఈ సినిమాను ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తుండగా గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ టైటిల్ లోగో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఊరి వాతావరణం, ఊర్లోని పలు భిన్న మనస్తత్వాలు, లక్షణాలున్న మనుషుల మధ్య సాగే సినిమా అని ఆ లోగోతో చెప్పేశారు. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది.

ఇప్పటివరకు మీరు ఎప్పుడూ చూడని చిరంజీవి రేర్ ఫోటోలు.. డోంట్ మిస్

తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ‘మంచోడే అంటావా?’ అంటూ హీరోయిన్ డైలాగ్‌తో గ్లింప్స్ ప్రారంభం కాగా ‘ఎవరే.. ’అని హీరోయిన్ ఫ్రెండ్ డైలాగ్, ‘అదే అభి..’ అంటూ హీరోయిన్ కాస్త హీరో ఇంట్రడక్షన్ చెప్పడం ఆ తరువాత ‘యమునా.. తొందరగా నా గురించి ఏమైనా ఆలోచించొచ్చు కదా?’ అని హీరో అనడం.. (నువ్వేమైనా అర్జున్ రెడ్డి సినిమాలో హీరో అనుకుంటున్నావా?’ అని హీరోయిన్ డైలాగ్ ఇలా గ్లింప్స్ మొత్తం ఆకట్టుకునే విధంగా సాగింది. ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల మాటలు అందించారు. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.

Exit mobile version