Site icon NTV Telugu

Shakuntalam: ఇంతమంచి పాట తెలుగులో విని చాలా కాలమే అయ్యింది…

Shakuntalam

Shakuntalam

లేడీ సూపర్ స్టార్ సమంతా చేస్తున్న లేటెస్ట్ సినిమా ‘శాకుంతలం’. కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి గుణశేఖర్ దర్శకుడు. ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ పాన్ ఇండియా మూవీ నుంచి ‘ఏలేలో ఏలేలో’ అనే సాంగ్ బయటకి వచ్చింది. శకుంతల, దుష్యంతుడిని కలవడానికి పడవలో వెళ్లే సమయంలో ఈ పాట వచ్చేలా ఉంది. ఇందులో పడవ నడిపే వ్యక్తిగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కనిపించాడు. ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ‘ఏలేలో ఏలేలో’ సాంగ్ సాగుతుంది. ‘రాజే తానై రాజ్యాలేలోటోడు నిన్ను చూడగానే బంటై పోతాడు’ అంటూ రాసిన లిరిక్స్ సినిమా కథని తెలిపేలా ఉన్నాయి.

ఈ పాట వచ్చే సమయంలోనే శకుంతల, తనకి దుష్యంతుడు ఇచ్చిన ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది. ఈ కారణంగా శకుంతలని, ఒక మహర్షి శాపం పని చేసి దుష్యంతుడు గుర్తు పట్టడు. సో ఎటు చూసిన ‘ఏలేలో ఏలేలో’ సాంగ్ శాకుంతలం సినిమాలో ఎంతో ముఖ్యమైన పాట. ఆరు నిమిషాల నిడివి ఉన్న ‘ఏలేలో ఏలేలో’ పాట తెలుగులో ఈ మధ్య కాలంలో వినంత గొప్పగా ఉంది. మణిశర్మ ట్యూన్, చైతన్య లిరిక్స్, అనురాగ్ కులకర్ణీ గొంతు ఈ ‘ఏలేలో ఏలేలో’ పాటకి ప్రాణం పోశాయి. సమంతా ఎప్పటిలాగే శకుంతలగా బ్యూటిఫుల్ గా కనిపిస్తూనే భర్తకి దూరంగా ఉన్న పెయిన్ ని భరించే స్త్రీగా అద్భుతంగా నటించింది. లిరికల్ సాంగ్ లో చూపించిన విజువల్స్ బాగున్నాయి, సినిమాలో ఇంకా బాగుండే అవకాశం ఉంది. శాకుంతలం సినిమాపై సమంతా చాలా ఆశలు పెట్టుకుంది, ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఫిబ్రవరి 17న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే సమంతా, గుణశేఖర్ లు స్కై హైలో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

https://twitter.com/Samanthaprabhu2/status/1620786985303674882

Exit mobile version