YCP Leaders Became Emotional after Watching Yatrw 2 movie: రేపు యాత్ర -2 సినిమా రిలీజ్ అవుతున్న క్రమంలో ఈరోజు వైసీపీ నేతలకు డైరెక్టర్ మహి నిర్మాతలు ప్రివ్యూ వేసి చూపించారు. విజయవాడలోని మల్టీప్లెక్స్ థియేటర్ లో మంత్రులు అంబటి రాంబాబు, చెల్లుబోయిన వేణు, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు కొంతమంది సినిమా చూశారు. ఆ తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ యాత్ర-2 సినిమా ఎంఎల్ఏ లు, ఎంఎల్సి లతో కలిసి చూసామని అన్నారు. కళ్ళ ముందు జరిగిన కథ ఈ సినిమా అని, రాజశేఖరరెడ్డి నాయకుడిగా ఎదిగిన దానిలో తెలియని విషయాలు సినిమా చూసి తెలుసుకోవచ్చని అన్నారు. అందరూ ఈ సినిమా చూసి భావోద్వేగానికి గురయ్యారని, కోట్లాది మందికి తెలిసిన వారి గురించి సినిమా చూడటంతో భావోద్వేగం వచ్చిందని అన్నారు. మనసున్న మనుషులు మన కళ్ళ ముందే దేవుళ్ళలా మారిపోవడం మన జ్ఞాపకం అని మరిచిపోయిన సంఘటనలు జ్ఞప్తికి వస్తాయని అన్నారు. రాజకీయం అంటే ఎత్తులు పై ఎత్తులు కాదు… ప్రజల మన్నన పొందాలని ఆయన అన్నారు.
Mohan Babu: హీరో పెళ్ళికి హాజరు కాలేనని తెలిసి.. మోహన్ బాబు ఏం చేశాడో తెలుసా..?
ఇక మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ జగన్ తండ్రి ఆశయాల కోసమే రాజకీయాల్లోకి వచ్చారని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే రాజకీయం అని ముగింపు వరకూ తెలిపారని అన్నారు. ప్రజలకు మంచిని నిరోధించాలని పలు పార్టీలు ఎలా చేసాయో చూపారని, పార్టీ పెట్టాక జగన్ చూపిన ప్రేమ, ప్రజల నమ్మకం, జగన్ ప్రయత్నాలు కనిపించాయని అన్నారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ సత్యానికి, దుర్మార్గానికి తేడా కళ్ళకు కట్టినట్టు చూపించారని,జగన్ ప్రజా జీవితంలో ఎదుర్కొన్న కుట్రలు కూడా చూపించారని అన్నారు. సినిమాలో మనసుకు హత్తుకునేలా యదార్ధ ఘటనలు చూపించారని అన్నారు. శ్రీకాళహస్తి ఎంఎల్ఏ బియ్యపు మధుసూధనరెడ్డి మాట్లాడుతూ సినిమా చూసాక పైనున్న రామారావు ఆనంద పడి ఉంటారు, రాజకీయ నాయకుడికి హీరో కి తేడా ఈ సినిమాలో తెలుస్తుందని అన్నారు. తండ్రి మాట నిలబెడుతూ పథకాలు తీసుకొచ్చాడని, యాత్ర – 2 డబుల్ హిట్ అవుతుందని అన్నారు.