Mohan Babu: హీరో పెళ్ళికి హాజరు కాలేనని తెలిసి.. మోహన్ బాబు ఏం చేశాడో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Babu: టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి సందడి మొదలుకానుంది. దిల్ రాజు తమ్ముడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆశిష్..ప్రస్తుతం సెల్ఫిష్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ మధ్యనే అద్వైత రెడ్డి అనే అమ్మాయితో అతనికి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. ఫిబ్రవరి 14 న జైపూర్ లో వీరి పెళ్లి ఘనంగా జరగనుంది. ఈ క్రమంలోనే దిల్ రాజు ఫ్యామిలీ పలువురు సెలబ్రిటీలను కలిసి వారికి శుభలేఖలు అందజేస్తున్నారు.
ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, జూ.ఎన్టీఆర్, ప్రభాస్, అఖిల్‌కి కూడా ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఇక అదే విధంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ని కూడా నిర్మాత దిల్ రాజు కలిశారు. ఇందిరానగర్‌లోని కేసీఆర్‌ని కలిసిన దిల్ రాజు తన తమ్ముడు శిరీష్ రెడ్డి కుమారుడు ఆశిష్ రెడ్డి పెళ్లికి రావాలని శుభలేఖ అందజేశారు. ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు దిల్ రాజు ఫ్యామిలీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివాహానికి ఆహ్వానించారు. తాజాగా ఈ కొత్త జంట.. మంచు ఫ్యామిలీని తమ పెళ్ళికి ఆహ్వానించారు. మంచు మోహన్ బాబు ఇంటికి వెళ్లి .. ఆయనకు పెళ్లి పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కాబోయే నూతన వధువరులను మెహన్‌బాబు ఆశీర్వదించారు. అయితే వారి పెళ్ళికి మోహన్ బాబు హాజరు కాలేకపోతున్నారని తెలుస్తోంది. ఆ సమయానికి మోహన్ బాబు ఇండియాలో ఉండడం లేదట. అందుకే నూతన జంటకు వారి పూజా మందిరం వద్ద దండలు మార్పించి ఆశీర్వాదాలు అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!