Yatra 2 OTT: ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైన యాత్ర 2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yatra 2 finally arriving on Amazon Prime Video: వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవా నటించిన యాత్ర 2 ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైంది. మహి వి రాఘవ్ పొలిటికల్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది రాబోయే ఎన్నికల కారణంగా పెద్ద హాట్ టాపిక్ అయింది. అయితే ఈ సినిమా విడుదలై మంచి రివ్యూస్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సత్తా చాటలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన ఈ చిత్రం ఇప్పుడు దాని OTT స్ట్రీమింగ్‌కు సిద్ధం అయింది. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం పదవి చేపట్టిన తర్వాత వచ్చిన యాత్రకు కొనసాగింపుగా యాత్ర 2 రూపొందింది. అయితే సీక్వెల్ మొదటి భాగం సూపర్ హిట్ కాగా రెండో భాగం మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Amala Paul : ఘనంగా అమలా పాల్ సీమంతం వేడుక..ఫోటోలు వైరల్..
Also Read
అయితే అంచనాలను అందుకోవడంలో ఈ రెండో భాగం విఫలమైంది. ఇక ఈ సినిమా 12 ఏప్రిల్ లేదా 19 ఏప్రిల్ OTTలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. నిజానికి మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ యాత్ర 2 సినిమా సాధారణ ఎంటర్టైనర్ సినిమా కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని, కాంగ్రెస్ హైకమాండ్ అభీష్టానికి వ్యతిరేకంగా ఆయన చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలోనే ఈ సినిమాను తెరకెక్కించారు. మరి కొద్దిరోజుల్లో APలో ఎన్నికలు జరగనున్న క్రమంలో వైసీపీ ఫాలోవర్స్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. దురదృష్టవశాత్తూ ఆ సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. అయితే OTT స్ట్రీమింగ్ ద్వారా ఈ సినిమా ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..