Site icon NTV Telugu

Yash: రావణుడు రామాయణం తీయబోతున్నాడు!

Yash Ramayana

Yash Ramayana

Yash to co-produce and act in Nitesh Tiwari-Ranbir Kapoor’s Ramayana: రాకింగ్ స్టార్ యాష్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ కలిసి రామాయణాన్ని నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరుకు ఎన్ని రామాయణాలు వచ్చినా ఏది కచ్చితమైన రామాయణం అనేది తెలియదు, కాని ఇప్పుడు అసలు రామాయణాన్ని తియ్యబోతున్నాం అని రెండు నిర్మాణ సంస్థలు ఒకటయ్యాయి. అవే ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్. మంచి విషన్ ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న నమిత్ మల్హోత్రా, రాకింగ్ స్టార్ యాష్ తో కలిసి రామాయణాన్ని నితేష్ తివారి దర్శకత్వంలో, DNEG విసువల్ ఎఫెక్ట్స్ కూడా ఇప్పటి వరకు ఎప్పుడు చూడని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలో యష్ మాట్లాడుతూ: నాకు ఎప్పటి నుండో ఉన్న కల, మన భారతీయ సినిమాని ప్రపంచ వేదిక మీద ఉంచాలని, నమిత్ నేను రామాయణం చేస్తే బాగుంటుంది అని చాలా సార్లు అనుకున్నాం.

Bhagyashri Borse : లక్ అంటే భాగ్యశ్రీ దే .. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..

కానీ అంత పెద్ద సబ్జెక్టు తియ్యాలి అంటే అది మామూలు విషయం కాదు, బడ్జెట్ కూడా సరిపోదు అందుకే నేను కూడా కో ప్రొడ్యూస్ చెయ్యాలనుకున్నా, రామాయణానికి నా మనసులో ఒక సుస్థిర స్థానం ఉంది. దాని కోసం ఎంతైనా కష్టపడతా, ప్రపంచ వేదికలో ప్రేక్షకులకి మంచి అనుభూతిని ఇస్తాను అన్నారు. రామాయణం అనేది మన జీవితాలకు ముడి పది ఉంటుంది, మనం నమ్ముతున్నాం, మనకి రామాయణం తెలుసు, అందులో జ్ఞానం, భావజాలం ఇలా ఎన్నో లేయర్స్ ఉంటాయి. మా విషన్ ఏంటి అంటే గ్లోబల్ స్టేజి మీద ఈ అద్భుతమైన రామయణాన్ని వెండి తేరా మీద చూపించాలి. అందులో ఉన్న ఎమోషన్స్, వాల్యూస్ అన్ని కూడా, రామాయణం యొక్క జర్నీ ని ప్రపంచం అంతా చూపించాలని అన్నారు. ఇక ఈ సినిమాలో రావణుడి పాత్రలో యష్ నటిస్తున్నారు.

Exit mobile version