KGF 2 మూవీ విడుదలకు భారీ ఎత్తున రంగం సిద్ధమవుతోంది. ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు నేడు తిరుపతిలో ప్రారంభమయ్యాయి. తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రాఖీ భాయ్ స్టోరీ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
Read Also : Yash : మల్టీస్టారర్ మూవీ… ఈ కథ అయితే చేస్తాడట !
కేజీఎఫ్ – ఛాప్టర్ 1కు 2కు తేడా ఏంటి అనే ప్రశ్నకు యష్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. రెండు పార్ట్ లకు చాలా తేడా ఉందని, కథలోనే పెద్ద డిఫరెన్స్, ఎలివేషన్ ఉందని అన్నారు. ఒక నటుడిగా తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టానని, ఇక నటనకు మంచి ఆస్కారం ఉందని అన్నారు. అయితే కేజీఎఫ్ 1లో మదర్ సెంటిమెంట్ ఉంది. మరి పార్ట్ 2లో కూడా మదర్ సెంటిమెంట్ ఉందా? లేదంటే ఓన్లీ యాక్షన్ ఉంటుందా ? అని ఓ విలేఖరి ప్రశ్నించారు. “లేదండి… స్టోరీ అందులో హాఫ్ లో ఆగిపోయింది. ఇందులో మదర్ సెంటిమెంట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. నన్ను అడిగితే ఇది తల్లీకొడుకుల సినిమా…. అదే మెయిన్ ఎమోషన్” అని చెప్పారు. అంటే సినిమాలో మదర్ సెంటిమెంట్ కీలకం… సినిమా మొత్తం తల్లీకొడుకుల చుట్టే తిరుగుతుందన్న మాట. మొత్తానికి హీరో యష్ కథలో కీలకమైన విషయాన్ని చెప్పేశారు. ఇక ఇటీవల KGF 2 నుంచి విడుదలైన “ఎదగరా ఎదగరా” సాంగ్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొత్తానికి యాక్షన్ తో పాటు సెంటిమెంట్ తో ప్రేక్షకులను కట్టిపడేయబోతున్నాడు రాఖీ భాయ్.
