Bollywood: సూపర్ మాన్ Vs బాట్ మాన్; ఐరన్ మాన్ Vs కెప్టెన్ అమెరిక; టైగర్ Vs పఠాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరల్డ్ సినిమా చూసిన బెస్ట్ ఫేస్ ఆఫ్ అంటే DCU లవర్స్ ‘బాట్ మాన్ Vs సూపర్ మాన్’ అంటారు, MCU లవర్స్ ‘కెప్టెన్ అమెరిక Vs ఐరన్ మాన్’ అంటారు. బాట్ మాన్ , సూపర్ మాన్, కెప్టెన్ అమెరికా, ఐరన్ మాన్… అందరూ సూపర్ హీరోలే, అందరికీ సూపర్ పవర్స్ ఉన్నాయి. వాళ్ల వాళ్ల యూనివర్స్ ల్లో ఆల్మోస్ట్ ఈక్వల్ రోల్స్ ప్లే చేశారు ఈ సూపర్ హీరోస్. విలన్స్ ని తుక్కుతుక్కుగా కొట్టే, ఈ సూపర్ హీరోలు కొట్టుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. టికెట్ రేట్ ఎంతసరే థియేటర్ కి వెళ్లి చూడాలి అనిపించేస్తుంది కదా. చాలా అరుదుగా ఇలాంటి ఫేస్ ఆఫ్ వార్స్ జరుగుతూ ఉంటాయి. ఇండియాలో, ఇండియన్ బాక్సాఫీస్ పునాదులతో సహా కదిలించడానికి ఇలాంటి యుద్ధమే ఒకటి జరగబోతోంది. DCU లవర్స్, MCU లవర్స్ బెస్ట్ ఫేస్ ఆఫ్ గురించి ఏం చెప్పారో, అలానే ఇండియాన్స్ ఇకపై బెస్ట్ ఫేస్ ఆఫ్ వార్స్ అనగానే ‘టైగర్ Vs పఠాన్’ అంటారేమో.
Read Also: Sharukh: టికెట్ రేట్ తగ్గిస్తూ పఠాన్ మాస్టర్ ప్లాన్… ఒకేసారి రెండు సినిమాలకి చెక్
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
మీరు చదివింది నిజమే, ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కొత్త హిస్టరీ క్రియేట్ చెయ్యడానికి యష్ రాజ్ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఇటివలే పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు కొల్లగొట్టిన మేకర్స్, ఈసారి వరల్డ్ బాక్సాఫీస్ నే టార్గెట్ చేస్తున్నట్లు ఉన్నారు. షారుఖ్ నటించిన పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ తో క్యామియో ప్లే చేయిస్తేనే వెయ్యి కోట్లు వచ్చాయి… ఇక ఇద్దరినీ కలిపి ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించినట్లు ఉన్నారు యష్ రాజ్ ఫిల్మ్స్. షారుఖ్ అండ్ సల్మాన్ కాదు షారుఖ్ Vs సల్మాన్ ఖాన్ కి ప్లాన్ చేస్తున్నారు. 2025లో సెట్స్ పైకి కూడా తీసుకోని వెళ్లనున్నారని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
Read Also: Pathaan: 1000 కోట్లు… అది షారుఖ్ ఖాన్ కంబ్యాక్ రేంజ్…
షారుఖ్ ‘పఠాన్’గా, సల్మాన్ ‘టైగర్’గా వార్ అంటే ఇండియన్ స్క్రీన్ తగలబడిపోతాయి. ఏ హీరో తక్కువ అయినా ఫాన్స్ అల్లకల్లోలం సృస్టిస్తారు. దీన్ని రాజమౌళి అంతటి వాడే బాలన్స్ చెయ్యలేకపోయాడు అంటే ఇండియాలో వేరే ఏ డైరెక్టర్ బాలన్స్ చెయ్యలేడు. ఈ విషయాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ ఆలోచించారో లేదో తెలియదు కానీ ఒక థాట్ గా అయితే టైగర్ vs పఠాన్ అనేది ఆన్ పేపర్ ఏ ఒక రెండు వేల కోట్ల సినిమాలా కనిపిస్తుంది. 2025లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే లోపే సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘టైగర్ 3’ సినిమాలో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’గా క్యామియో ప్లే చేస్తున్నాడు. 15 నిమిషాల పాటు ఉండబోయే ఈ ఎపిసోడ్ లోనే నెక్స్ట్ షారుఖ్ vs సల్మాన్ సినిమాకి ప్లాట్ ని ఎస్టాబ్లిష్ చేస్తారేమో. ఏది ఏమైనా షారుఖ్, సల్మాన్ లు కలిసి కనిపిస్తేనే కాసుల వర్షం కురుస్తుంది. అలాంటిది ఇద్దరు ఎదురెదురుగా నిలబడి యుద్ధం చేస్తారు అంటే ఆ సినిమా క్రియేట్ చెయ్యబోయే హిస్టీరియాని ఊహించడం కూడా కష్టమే అవుతుంది. మరి ఈ ఇండియాస్ మోస్ట్ కాస్ట్లీయస్ట్ ఫిల్మ్ ని డైరెక్ట్ చేసేది ఎవరో చూడాలి.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!