NTV Telugu Site icon

War 2: అప్పుడే రిలీజ్ డేట్ లాక్ చేసారా? NTR vs Hrithik

War 2

War 2

యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ ఒక సినిమాలో కలిసి నటిస్తారని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. అలంటి ఒక రోజు వస్తుందని ఎన్టీఆర్ ఫాన్స్ కూడా అనుకోని ఉండరు. ఈ రేరెస్ట్ కాంబినేషన్ ని సెట్ చేస్తూ ‘వార్ 2’ సినిమా అనౌన్స్ అయ్యింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే రోజున “యుద్ధభూమిలో నీకోసం ఎదురు చూస్తూ ఉంటా మిత్రమా” అని హ్రితిక్ రోషన్ ట్వీట్ చెయ్యడంతో వార్ 2 సినిమా అఫీషియల్ గా ఆన్ అయ్యింది. హ్రితిక్ ట్వీట్ కి “యుద్ధభూమిలో మీకు రెస్ట్ ఉండదు, ఈలోపే రెస్ట్ తీసుకోండి” అని ఎన్టీఆర్ ఇచ్చిన రిప్లై బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కాకుండా ఫారిన్ లో కూడా ఎన్టీఆర్ అండ్ హ్రితిక్ రోషన్ కి సాలిడ్ ఫాలోయింగ్ ఉంది. ఈ కారణంగానే ‘వార్ 2’ గురించి ఎన్టీఆర్-హ్రితిక్ రోషన్ ట్వీట్స్ చెయ్యగానే ‘వార్ 2’ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. ‘వార్’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ సినిమాని ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు.

యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యునివర్స్ లో భాగంగా ‘వార్ 2’ రూపొందనుంది. హ్రితిక్, ఎన్టీఆర్ లు తమ ట్వీట్స్ లో “సీ యు సూన్” అనడంతో ఎప్పటి నుంచి వార్ 2 సెట్స్ పైకి వెళ్తుంది అనే డిస్కషన్ అందరిలోనూ జరుగుతుంది. షూటింగ్ ఎప్పటినుంచి అనే విషయం పక్కన పెడితే రిలీజ్ డేట్ ని మాత్రం మేకర్స్ లాక్ చేసినట్లు సమాచారం. 24 జనవరి 2025న వార్ 2 సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకోని రావడానికి మేకర్స్ రెడీ అయ్యారట. ఈ ఇయర్ ఇదే డేట్ నుంచి వచ్చిన పఠాన్ మూవీ హిందీలో వెయ్యి కోట్లు సాధించింది. మరి రిలీజ్ డేట్ లాక్ చేసారు అంటే యష్ రాజ్ ఫిల్మ్ వార్ 2ని ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకోని వెళ్లాలి. ఆలోపు కొరటాల శివతో ‘దేవర’ షూటింగ్ పార్ట్ ని ఎన్టీఆర్ కంప్లీట్ చేయాలి.