Site icon NTV Telugu

Yash : నన్ను పొగరుబోతు అని ముద్ర వేశారు.. యష్ ఎమోషనల్

Toxic

Toxic

Yash : హీరో యష్ చాలా రోజుల తర్వాత వెండితెరపై కనిపించబోతున్నాడు. కేజీఎఫ్‌-2 తర్వాత ఆయన నుంచి మరో సినిమా రాలేదు. దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన టాక్సిక్‌: ఎ ఫేరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా భారీ అంచనాలు నడుమ వస్తోంది. వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా వచ్చిన టీజర్ బాగానే ఆకట్టుకుంది. అయితే వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్న యష్.. తాజాగా చేసిన కామెంట్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇందులో ఆయన కన్నడ సినిమా ఇండస్ట్రీ మొదట్లో తనను ఎలా చూసిందో చెప్పుకొచ్చారు.

Read Also : Flight Break Fail: తృటిలో పెను ప్రమాదం తప్పించుకున్న డిప్యూటీ సీఎం..

తాజాగా బెంగళూరులో జరిగిన మనడ కదలు సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు చీఫ్‌ గెస్ట్ గా వచ్చాడు యష్. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి నటుడికి జాగ్రత్త అనేది చాలా అవసరం. నేను కూడా హీరోగా వచ్చిన మొదట్లో ప్రతి డైరెక్టర్ ను కథ కాపీ ఇవ్వమని అడిగేవాడిని. ఎందుకంటే కథ మొత్తం చదివితే అది ఓకే అయితేనే చేద్దాం అనేవాడిని. నేను అలా అడిగేసరికి అందరూ నాకు పొగరు అనుకున్నారు. ఇండస్ట్రీలో అదే స్ప్రెడ్ చేశారు. దాంతో నాకు చాలా అవకాశాలు పోయాయి. అయినా సరే నేను బాధపడలేదు. ఎందుకంటే మనల్ని మనం నమ్ముకుని పనిచేసినప్పుడు రిజల్ట్ అనుకున్నట్టు వస్తుంది’ అంటూ యష్ తెలిపారు. ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్స్ చేశారా అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు.

Exit mobile version