Site icon NTV Telugu

Yami Gautam : హీరోయిన్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్

Yami

Yami

బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ని యాక్సెస్ చేయలేకపోపోతున్నాను అని ప్రకటించింది. ఈ విషయాన్ని తన అభిమానులు, ఫాలోవర్‌లకు ఏప్రిల్ 3న తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. తన ఖాతా బహుశా హ్యాక్ అయ్యిందని, ఆ
ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఏదైనా అసాధారణ కార్యకలాపం జరిగితే జాగ్రత్తగా ఉండాలని కోరింది. “హాయ్, నేను నిన్నటి నుండి నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను యాక్సెస్ చేయలేకపోతున్నాను. బహుశా ఇది హ్యాక్ చేయబడి ఉండవచ్చునని మీకు తెలియజేయడానికి ఈ పోస్ట్ చేస్తున్నాను. మేము వీలైనంత త్వరగా దాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈలోగా నా ఖాతా ద్వారా ఏదైనా అసాధారణ కార్యకలాపం ఉంటే, దయచేసి గమనించగలరు. ధన్యవాదాలు” అంటూ పోస్ట్ చేసింది. ఇక యామీకి ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫోటో షేరింగ్ యాప్‌లో ఆమెకు 15.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Read Also : 30 Weds 21 : పృథ్వీ, మేఘన కథ సుఖాంతం!

యామీ గౌతమ్ సినిమాల విషయానికొస్తే త్వరలో ఆమె “దాస్వీ”లో కనిపించనుంది. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, నిమ్రత్ కౌర్‌లతో నటి స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనుంది. యామీ ప్రస్తుతం “దాస్వీ” ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఆమె ఖాతాలో అనిరుద్ధ రాయ్ చౌదరి ‘లాస్ట్’, ‘OMG: ఓ మై గాడ్’ సీక్వెల్ కూడా ఉన్నాయి.

Exit mobile version