Yadu Vamsi Interview: ‘కమిటీ కుర్రోళ్లు’ షూట్ చేస్తుంటే పూనకాలు వచ్చాయి.. ఏమాత్రం ఊహించలేదు!
- ఆగస్ట్ 9న కమిటీ కుర్రోళ్ళు సినిమా
- నిహారిక కొణిదెల సమర్పణలో కమిటీ కుర్రోళ్ళు
- మీడియాతో ముచ్చటించిన దర్శకుడు యదు వంశీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadu Vamsi Interview for Committee Kurrollu Movie: నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ మూవీ ఆగస్ట్ 9న రాబోతోంది. యదు వంశీ దర్శకుడుగా వ్యవహరించిన ఈ సినిమాలో దాదాపు అంతా కొత్త వారే నటించారు. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ ఆకట్టుకున్న క్రమంలో సినిమా అందరిలోనూ అంచనాలు పెంచేసింది. తాజాగా బుధవారం నాడు దర్శకుడు యదు వంశీ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలు మీకోసం .
మీ నేపథ్యం?
* నేను ఓ ఇండీ ఫిల్మ్ తీశాను. ఆ చిత్రానికి మంచి పేరు వచ్చింది. నేను ఇంత వరకు ఎవరి దగ్గర పని చేయలేదు. సినిమాలకు సంబంధించిన అనుభవం లేదు. కానీ ఈ కథను రాసుకుని చాలా ప్రొడక్షన్ కంపెనీలు తిరిగాను. చివరకు నిహారిక గారి వద్దకు ఈ కథ వెళ్లింది.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
లైన్ కి స్ఫూర్టి ఏంటి?
* మా ఊళ్లో జరిగే జాతరను బేస్ చేసుకుని ఈ కథను రాసుకున్నాను. ఇందులో ప్రతీ ఒక్కరి కథ ఉంటుంది. ప్రతీ కుర్రాడి కథ ఇందులో కనిపిస్తుంది. ఇందులో నా పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్ కూడా ఉంటుంది.
నిహారికతో వర్క్ ఎక్స్ పీరియన్స్
* స్క్రీన్ మీద సినిమా ఎలా కనిపించాలనేది నిహారిక గారికి తెలుసు. దానికి ఏం కావాలో అన్నీ సమకూర్చారు. చెప్పింది చెప్పినట్టుగా తీసే ఫ్రీడం ఇచ్చారు. నిహారిక గారు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఒకేలా ఉన్నారు.
కథకు తెలిసిన వాళ్లు నటించి ఉంటే రీచ్ బాగుండేది ఏమో?
* ఇలాంటి కథకు తెలిసిన వాళ్లు నటించి ఉంటే.. వాళ్లకంటూ సపరేట్ బ్యాగేజ్ ఉండేది. ఇందులో ప్రతీ పాత్ర కూడా హీరోలానే ఉంటుంది. అందుకే అందరూ కొత్త వాళ్లతోనే ట్రై చేశాను. ప్రసాద్ ఒక్కడే కాస్త తెలిసిన వ్యక్తి. పాత్రకు తగ్గట్టుగానే ఆయన నటించాడు. కథ కోసం అందరూ వెయిట్ లాస్, గెయిన్ అయ్యారు.
పవన్ కళ్యాణ్ స్ఫూర్తి అని విన్నాం?
* నాకు ఈ కథ మీద చాలా నమ్మకం ఉంది. రెగ్యులర్ పంథాలో వెళ్లకూడదనే ఉద్దేశంలో ఇలాంటి కథను ఎంచుకున్నాను. 2019లో కొంత రీసెర్చ్ చేశాను. జయప్రకాష్ నారాయణ గారు, పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు మాట్లాడారు. వాళ్లు మాట్లాడిన కొన్ని మాటల స్పూర్తితోనే కొన్ని సీన్లను రాసుకున్నాను. ఫ్రెండ్ షిప్, పొలిటికల్ అంశాలను ఇందులో జొప్పించాను.
ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేశారా?
* సాయి కుమార్ వంటి సీనియర్ తో నటించడం ఆనందంగా ఉంది. మొదటి రెండ్రోజులు కాస్త భయపడ్డాను. కానీ ఆయన ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ప్రతీ సీన్లో ఆయన అనుభవం చూపించారు.
సెలబ్రిటీల రెస్పాన్స్ ఎలా ఉంది?
* సెట్లో అందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలని వర్క్ షాప్స్ ఎక్కువగా చేశాను. చిరంజీవి గారు సినిమా చూసి అందరూ అద్భుతంగా నటించారని చెప్పడం, వరుణ్ తేజ్ గారు చూసి 11 మంది ఇరగ్గొట్టేశారని చెప్పడంతో చాలా ఆనందమేసింది.
కేరళ బ్యాక్ డ్రాప్ లా అనిపిస్త్తోంది?
* కేరళలో ఉన్నంత అందం కోనసీమలో ఉంది. ఆ అందాన్ని మరింత అందంగా చూపించాం. మా రాజు గారు పెట్టిన లైటింగ్, చూపించిన విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 90వ దశకంలోకి తీసుకెళ్లగలిగాం. అనుదీప్ గారి పాటలు అందరినీ మెప్పించాయి.
నెక్ట్స్ సినిమా?
* నెక్ట్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో కథను రాసుకుంటున్నాను. అందరూ భయపడేలా ఈ కథ ఉంటుంది. ఈ మూవీ పెద్ద హిట్ అయితే.. నేను అనుకున్న హీరోతోనే ఆ సినిమా చేస్తాను.
కంటెంట్‌ను నమ్మారా?
* మాలాంటి కొత్త వాళ్లతో సినిమా అంటే అందరూ బడ్జెట్ గురించి లిమిట్స్ పెడతారు. కానీ నిహారిక గారు ఎప్పుడూ బడ్జెట్ విషయాలు మా వరకు రానివ్వలేదు. సినిమాకు ఏం కావాలో అది చేశారు. ఆమె మా కంటెంట్‌ను నమ్మారు.
పూనకాలు వచ్చాయట?
* ఇందులో మదర్ సెంటిమెంట్ అందరినీ కదిలిస్తుంది. థియేటర్లో ఆ సీన్ చూస్తే కంట్లోంచి నీళ్లు వస్తాయి. అమ్మ సెంటిమెంట్‌ను ఎంత బాగా చూపించాలో అంత బాగా చూపించాను. మన ఊరు.. మన కుర్రోళ్లు.. మన ప్రేమ.. మన భావోద్వేగాలు.. అన్ని రకాల అంశాలతో ఉన్న ఎంటర్టైన్మెంట్ను అందిస్తాం. థియేటర్లో చూడాల్సిన సినిమా. థియేటర్లో కూర్చుంటో నిజంగా జాతరలో ఉండి సినిమాను చూసినట్టుగా అనిపిస్తుంది. నిజంగానే కొంత మందికి పూనకాలు వచ్చాయి. ఈ మూవీని థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ వస్తుంది.
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!