Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు కోసం టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తోంది. పవన్- రేణు లు పుట్టిన మొదటి సంతానం అకీరా నందన్. మెగా వారసుడుగా అకీరా పెరుగుతూ వచ్చాడు. పవన్ తో రేణు విడిపోయినా అకీరాను మాత్రం మెగా కుటుంబానికి దగ్గరగానే ఉంచింది. మెగా కుటుంబంలో ఏ ఈవెంట్ అయినా కూడా అకీరా, ఆద్య ఉంటారు. అకీరా దాదాపు 20 ఏళ్లకు వచ్చేశాడు. హీరో ఎంట్రీ ఇవ్వడానికి కరెక్ట్ వయస్సు. ఇక తండ్రి పోలికలను అచ్చుగుద్దినట్లు దింపేశాడు. అంతేకాకుండా తండ్రిలానే మార్షల్ ఆర్ట్స్ అని, కర్రసాము అని.. అన్ని నేర్చుకున్నాడు. ఇవే కాకుండా సంగీతం, కథలు రాయడం ఇలాంటివాటిని కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీంతో అకీరా ఎప్పుడెప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడా ..? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక అభిమానులతో పాటు.. ఒక స్టార్ రైటర్ కూడా అకీరా కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన ఎవరో కాదు.. దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్.
RK Roja: మహేష్ బాబు తో సినిమా.. అలాంటి పాత్ర అయితేనే చేస్తా
ఇక గతరాత్రి జరిగిన టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవితేజతో పాటు రేణుదేశాయ్‌పై ప్రశంసలు కురిపించారు. “రేణు దేశాయ్ గారు మీరు తెలుగు సినిమాలు చేయకపోయినా, తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉన్నారు. ఐతే, మీరు మాత్రం మీ అబ్బాయి అకీరా నందన్ ను హీరోగా చేయాలి. అలాగే అకీరా నందన్ చేసే సినిమాలో అతని తల్లి పాత్రను కూడా మీరే చేయాలనేదే నా మాట” అని చెప్పుకొచ్చాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇప్పటివరకు రేణు.. అకీరా సినిమాల్లోకి వస్తాడు.. లేనిది అతని ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు ఫ్యాన్స్ తో పాటు.. చాలామంది ప్రముఖులు కూడా పవన్ వారసుడు కోసం ఎదురుచూస్తున్నారని తెలిసి.. కొడుకు ఎంట్రీకి కష్టపడుతుందేమో చూడాలి.