Site icon NTV Telugu

Pawan Kalyan : పవన్ సినిమా ఉండగా.. థియేటర్లు బంద్ అవుతాయా..?

Pawankalyan

Pawankalyan

Pawan Kalyan : ఏపీ, తెలంగాణ ఎగ్జిబిటర్లు నిన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి థియేటర్లు అన్నీ బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు. థియేటర్లు అద్దె ప్రాతిపదికన నడిపించడం కుదరదని.. పర్సెంటీజీ అయితేనే నడిపిస్తామని తేల్చి చెప్పేశారు. ఇదే ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. జూన్ నుంచి థియేటర్లు నిజంగానే బంద్ అవుతాయా.. ఆ లోపే వారి సమస్యలు పరిష్కారం అవుతాయా అనే అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి. కానీ ఎగ్జిబిటర్ల సమస్యలను నేరుగా తీర్చేందుకు ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు రెడీగ లేరు. అలా ఉంటే ఎగ్జిబిటర్లు ఇంతటి నిర్ణయం తీసుకునే వారు కాదు. కానీ జూన్ లో పెద్ద సినిమాలు ఉన్నాయి .

Read Also : Manoj : ఆ వీడియో చూసి స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న మనోజ్..

మరీ ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ నటించిన మోస్ట్ వెయిటెడ్ సినిమా హరిహర వీరమల్లు రాబోతోంది. జూన్ 12న ఇది వస్తోంది. మరి పవన్ సినిమా ఉండగా థియేటర్లు బంద్ అవుతాయా అనే ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. ఏపీ ప్రభుత్వంలో ఉన్న పవన్ తన సినిమాకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అనుకోవచ్చు. ఇప్పటికే వీరమల్లు వాయిదాలు పడుతూ ఫైనల్ గా రిలీజ్ డేట్ ప్రకటించింది. కాబట్టి దాన్ని మరోసారి వాయిదా వేసే ప్రసక్తే లేదు. ఎగ్జిబిటర్లతో చర్చలు జరిపి థియేటర్లు బంద్ కాకుండా చూడాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. దిల్ రాజుతో పాటు బడా నిర్మాతలు ఇదే పనిలో ఉన్నారంట.

పర్సెంటేజీ కాకుండా లీజుకు ఇవ్వడం లాంటి వాటిపై దృష్టి పెడుతున్నారంట. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లలో ఎవరూ నష్టపోకుండా చూడాలని ఇప్పటికే టాలీవుడ్ పెద్దలకు పవన్ కల్యాణ్‌ నుంచి సూచనలు వెళ్లినట్టు తెలుస్తోంది. పెద్ద సినిమాలు అన్నీ జూన్ లోనే ఉన్నాయి. కాబట్టి థియేటర్లు బంద్ చేస్తే రెండు వర్గాలు భారీగా నష్టపోతారు. ఈ విషయాలను వారికి వివరించి చర్చలు సఫలం అయ్యేలా చూస్తున్నారంట. పరిస్థితులను బట్టి చూస్తుంటే జూన్ వచ్చే లోపే ఎగ్జిబిటర్లతో చర్చలు సఫలం అయ్యేలా కనిపిస్తున్నాయి. కాబట్టి థియేటర్లు బంద్ ఉండకపోవచ్చు అంటున్నారు.

Read Also : Retro : రెట్రో కలెక్షన్లు.. సూర్య కెరీర్ లోనే హయ్యెస్ట్..

Exit mobile version