దళపతి విజయ్ ఫాన్స్ కి, తల అజిత్ ఫాన్స్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత రైవల్రీ ఉంది. అజిత్, విజయ్ ఫ్యాన్స్ ‘ఫాన్ వార్’ అనే పదానికే నిలువెత్తు నిదర్శనంలా ఉంటారు. టాపిక్ తో సంబంధం లేకుండా, ఎలాంటి విశేషం లేకుండా ట్విట్టర్ లో ట్రెండ్ చెయ్యడం ఈ ఇద్దరు హీరోల అభిమానులకి బాగా అలవాటైన పని. 1996 నుంచి మొదలైన ఈ ఫ్యాన్ వార్ లో తిట్టుకోవడమే కాదు కొట్టుకోవడం కూడా జరుగుతుంది. ఇక ట్రోల్లింగ్ లో అయితే నేషనల్ అవార్డ్ ని పొందే రేంజులో సోషల్ మీడియాలో హల్చల్ చేసే అజిత్, విజయ్ ఫాన్స్ మధ్య ఈ సంక్రాంతికి ఫేస్ ఆఫ్ జరగనుంది. 2023 పొంగల్ కి విజయ్, అజిత్ లు నటించిన ‘వారిసు’, ‘తునివు’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కేవలం ఒక్క రోజు తేడాతో రిలీజ్ అవనున్న ఈ రెండు సినిమాలు కోలీవుడ్ లో హీట్ పెంచుతున్నాయి. ఏ హీరోకి ఎక్కువ థియేటర్స్ ఇస్తారు? ఏ హీరో సినిమా హిట్ అవుతుంది? ఏ హీరో మూవీ ఎక్కువ కలెక్షన్స్ రాబుతుంది? అనే డిస్కషన్స్ తమిళనాడులో ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి.
రోజులు గడిచే కొద్దీ ఫ్యాన్ వార్ తారాస్థాయికి చేరుతుంది, ఈ గోడవలని కాస్త కంట్రోల్ చెయ్యాలి అంటే అజిత్, విజయ్ లలో ఎవరో ఒకరు బయటకి వచ్చి మాట్లాడాలి. అజిత్ తన సినిమా ప్రమోషన్స్ కోసం బయటకి రావడం అనేది జరగని పని, ఇప్పటివరకూ అజిత్ తన సినిమాకి ఎలాంటి ప్రమోషనల్ ఈవెంట్స్ చెయ్యలేదు. ‘తునివు’ పరిస్థితి కూడా దాదాపు ఇదే. ఇక మిగిలింది విజయ్, ‘వారిసు’ ఆడియో లాంచ్ డిసెంబర్ 24న జరగనుంది. ‘ఎన్ నింజిల్ కుడి ఇరుక్కుమ్’ అంటూ విజయ్ మొదలుపెట్టే స్పీచ్ ని వినడానికి ఫాన్స్ భారి ఎత్తున వస్తారు. అంతమంది మధ్యలో విజయ్, అజిత్ గురించి… ఫ్యాన్ వార్ ఇష్యూని అడ్రెస్ చేస్తే, సినిమా సినిమాగా మాత్రమే చూడండనో, తన సినిమాతో పాటు అజిత్ సినిమా కూడా హిట్ అవ్వాలనో విజయ్ మాట్లాడితే… అభిమానులు గొడవపడే అవకాశం కాస్త తగ్గుతుంది. మరి విజయ్ ఫ్యాన్ వార్స్ ని ఉద్దేశించి మాట్లాడుతాడో లేదో చూడాలి.
