ప్రస్తుతం ఇండియాలో లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా యూనివర్స్ లోకి ఇప్పటికే కమల్ హాసన్, సూర్య, కార్తి, ఫాహాద్ ఫజిల్, విజయ్ సేతుపతి ఎంటర్ అయ్యారు. దళపతి విజయ్ ని కూడా తన LCUలోకి తెస్తూ లియో చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి కానీ అఫీషియల్ గా లోకేష్ కనగారాజ్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. ఒకవేళ ఆ మాట నిజమయ్యి LCUలోకి విజయ్ ఎంటర్ అయితే ఫ్యూచర్ లో ఊహకందని కాంబినేషన్స్ లో సినిమాలు చూడొచ్చు. ప్రస్తుతం లియో సినిమా షెడ్యూల్ బ్రేక్ లో ఉంది, నెక్స్ట్ మంత్ చెన్నైలో లియో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వనుంది. ఈ గ్యాప్ లో లోకేష్, LCUలోకి సూపర్ స్టార్ రజినీకాంత్ ని తీసుకోని వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. త్వరలో లోకేష్ కనగరాజ్, రజినీకాంత్ ని కలిసి కథ చెప్పబోతున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే ఎప్పుడో అనౌన్స్ అవ్వాల్సిన కాంబినేషన్ చాలా రోజులుగా సెట్ అవ్వలేదు. ఈ నెలలో జరగబోయే మీటింగ్ తో ఎదో ఒకటి తేలిపోతుంది, రజినీకాంత్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని కోలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తుంది.
లోకేష్ కనగరాజ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కి రజినీకాంత్ కి ఉన్న ఇమేజ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ ఇద్దరూ కలిస్తే అది బాక్సాఫీస్ దగ్గర ముందెన్నడూ చూడనంత మోస్ట్ డేంజరస్ కాంబినేషన్ గా మారుతుంది. జైలర్ కంప్లీట్ అయిన తర్వాత రజినీకాంత్, లియో సినిమా కంప్లీట్ అయిన తర్వాత లోకేష్ కనగారాజ్ కాంబినేషన్ లో LCUలో ఒక్క సినిమా చేస్తారేమో చూడాలి. LCUలోకి ఒక్కసారి సూపర్ స్టార్ ఎంటర్ అయితే రజినీకాంత్ Vs కమల్ హాసన్; రజినీకాంత్-సూర్య; రజినీకాంత్-విజయ్… ఇలా ఏ కాంబినేషన్ లో అయిన సినిమా పడే స్కోప్ ఉంటుంది. అన్నింటికన్నా మోస్ట్ ఎగ్జైటింగ్ ఫేస్ ఆఫ్ రజినీకాంత్ Vs కమల్ హాసన్. రజినీ గ్రే షేడ్ క్యారెక్టర్ లో, కమల్ పాజిటివ్ క్యారెక్టర్ లో సినిమా చేస్తే దాని రిజల్ట్ ని ఊహించడం కూడా కష్టమే. ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఆ కాంబినేషన్ సెట్ అవ్వాలి అంటే LCUలోకి రజినీ ఎంటర్ అవ్వాలి. మరి లోకేష్ ఏం ప్లాన్ చేసాడో? రజినీకాంత్ ని ఏ కథ చెప్పి ఒప్పిస్తాడో చూడాలి.