పాపులర్ హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ కు ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది. ఆస్కార్ 2022 సంఘటన తర్వాత ఆయనకు అన్నీ చేదు ఘటనలే ఎదురవుతున్నాయి. క్రిస్ రాక్‌ను ఆస్కార్ 2022 అవార్డుల వేదికపై కొట్టి సంచలనం సృష్టించిన విల్ స్మిత్ ఆ తరువాత ఆయనకు, ఆయన కుటుంబానికి బహిరంగంగానే క్షమాపణలు చెప్పాడు. అకాడమీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ వివాదాల మధ్య విల్ స్మిత్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లు ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also : Rahul Sipligunj : పబ్ లో అడ్డంగా దొరికిపోయిన బిగ్ బాస్ విన్నర్… పోలీసుల అదుపులో 150 మంది
హాలీవుడ్ రిపోర్టర్ ప్రకారం విల్ స్మిత్ రాబోయే యాక్షన్ చిత్రం “ఫాస్ట్ అండ్ లూజ్”ను నెట్‌ఫ్లిక్స్ హోల్డ్ లో ఉంచినట్టు తెలుస్తోంది. దర్శకుడు డేవిడ్ లీచ్ రియాన్ గోస్లింగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఈ చిత్రం ఇటీవల మరో బిగ్ చేంజ్ ను ఎదుర్కొంది. అయితే స్మిత్ ఆస్కార్ లో జరిగిన సంఘటనే స్ట్రీమింగ్ దిగ్గజం ప్రాజెక్ట్‌ను హోల్డ్ లో ఉంచడానికి బలమైన కారణం అంటున్నారు. ఫాస్ట్ అండ్ లూస్ హోల్డ్‌లో ఉన్నప్పటికీ, విల్ ఇతర ప్రాజెక్ట్ లు ఎమాన్సిపేషన్, AppleTV+ డ్రామా ఉన్నాయి. అలాగే “బ్యాడ్ బాయ్స్ 4” కోసం చర్చలు జరుపుతున్నప్పటికీ, ఆస్కార్ సంఘటన మధ్య సోనీ కూడా ప్రాజెక్ట్ ను హోల్డ్ లో ఉంచినట్టు తెలుస్తోంది.