Rashmika : నేషనల్ క్రష్ రష్మికతో విజయ్ దేవరకొండకు మొన్ననే ఎంగేజ్ మెంట్ అయింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. తరచూ బయటకు వెళ్లి దొరికిపోతున్నా వీరు మాత్రం సైలెంట్ గానే ఉండిపోయారు. ఎట్టకేలకు వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. 2026లో వీరి పెళ్లి ఉండబోతోంది. అయితే పెళ్లి తర్వాత రష్మిక సినిమాలు మానేస్తుందనే ప్రచారం మొదలైంది. ఎందుకంటే సౌత్ లో హీరోలను పెళ్లి చేసుకున్న హీరోయిన్లు సినిమాలు మానేస్తున్న సంగతి తెలిసిందే.
Read Also : OG : ఓజీ-2లో అకీరా.. సుజీత్ సంచలన స్టేట్ మెంట్
మహేశ్ బాబు-నమ్రత, నాగార్జున-అమల, కిరణ్ అబ్బవరం-రహస్య ఇలా చాలా మందే ఉన్నారు. పైగా పెళ్లి తర్వాత విజయ్ కంటే రష్మిక క్రేజ్ ఎక్కువగా ఉంటే ఇబ్బంది అవుతుంది. రష్మికకు నేషనల్ వైడ్ గా ఫాలోయింగ్ ఉంది. కానీ విజయ్ కు ఆ స్థాయిలో గుర్తింపు ఇంకా రాలేదు. కాబట్టి తన కంటే రష్మిక క్రేజ్ ఉంటే విజయ్ కు ఇబ్బందులు తప్పవు. అందుకే రష్మిక సినిమాలు మానేస్తుందనే రూమర్లు వస్తున్నాయి. కానీ వాటిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే రష్మిక ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలు నాలుగైదు ఉన్నాయి. అవన్నీ పూర్తి కావాలంటే ఇంకో రెండేళ్లు పడుతుంది. కాబట్టి ఆ రెండేళ్ల తర్వాతనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
Read Also : Hema : ఎవరినైనా చంపేయాలి అనిపించేది : హేమ
